Mahesh ప్రెజర్ పెంచిందెవరు?
సూపర్ స్టార్ మహేశ్ బాబు మీద కొండత భారం ఉంది. అదే గుంటూరు కారం రిజల్ట్ మీదున్న అంచనాలు. అసలే ఆగి ఆగి తెరకెక్కుతోంది.

Mahesh Babu's film directed by Trivikram will release on Sankranti. The talk of how it is going to be is loud
సూపర్ స్టార్ మహేశ్ బాబు మీద కొండత భారం ఉంది. అదే గుంటూరు కారం రిజల్ట్ మీదున్న అంచనాలు. అసలే ఆగి ఆగి తెరకెక్కుతోంది. రెండు సార్లు కథ మారింది. ఒక సారి హీరోయిన్ మారింది. మధ్యలో త్రివిక్రమ్ కి క్లాస్ పడటంతో పాటు తమన్ ని తీసేసే పరిస్థితొచ్చింది. ఫైనల్ గా డబ్బింగ్ మొదలై సంక్రాంతికి ఈసినిమా రాబోతోంది. కాని ఈమూవీ రిజల్ట్ మీద ముందు నుంచే డౌట్లు పెరుగుతున్నాయి.
అసలే సర్కారు వారి పాట కొండంత రాగం తీసి యావరేజ్ హిట్ తో కానిచ్చేశాడు డైరెక్టర్ పరశురామ్. అలానే త్రివిక్రమ్ కూడా మహేశ్ కి షాక్ ఇస్తాడా? సినిమాలన్నాక హిట్టవుతాయి. ఫెయిలవుతాయి.. ఆమాత్రానికే గుంటూరు కారం రిజల్ట్ రివర్స్అయితే ఏదో జరిగిపోతుంది అనేంత సీన్ ఎందుకు క్రియేట్ అవుతోందంటే, కారణం రాజమౌళి మూవీనే. గుంటూరు కారం తర్వాత దర్శకధీరుడి మూవీ చేస్తూ మహేశ్ బాబు కనీసం రెండేళ్లు లేదంటే మూడేళ్లు ఆ ప్రాజెక్టుకే అంకితం అవుతాడు. సో తన నుంచి మరో మూవీ రావాలన్నా, అప్ డేట్స్ రావాలన్నా కనీసం రెండు నుంచి మూడేళ్లు ఆగాలి.
కాబట్టే గుంటూరు కారం హిట్టైతే, ఓ మంచి మెమోరి.. హీరోతో పాటు ఫ్యాన్స్ కి దక్కుతుంది. లేదంటే అజ్ఞాతవాసి పంచ్ తో పవన్ తన ఫస్ట్ ఇన్నింగ్స్ కి బ్రేకేసినట్టే ఉంటుంది. ఇలాంటి ప్రెజర్ మహేశ్ తోపాటు తన ఫ్యాన్స్ మీద కూడా పెరుగుతోంది. ఐతే రామ్ చరణ్ మీద మరోరకం ప్రెజర్ పనిచేస్తోంది. త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఇమేజు, క్రేజు పెరిగింది.