Rajamouli, Mahesh Babu : త్రివిక్రమ్ కు రాజమౌళి కి మధ్యలో దూరిన అనిల్ రావిపూడి..!
మహేష్ కెరీర్ లో ఇప్పటికే వేగంగా సినిమాలు చేసింది ఇద్దరే. ఒకరు పూరి జగన్నాధ్. రెండు అనిల్ రావిపూడి. ఫస్ట్ ఆప్షన్ సాధ్యం కాదు. ఎందుకంటే పూరీ ఇప్పుడు రామ్ తో 'డబుల్ ఇస్మార్ట్' చేస్తున్నాడు. ఇక రెండో ఆప్షన్ అనిల్ రావిపూడి.

Mahesh has already done fast films in his career One is Puri Jagannadh. Both Anil Ravipudi And Mahesh Moggu for Anil Ravipudi movie
రాజమౌళి తో సినిమా అంటే ఏ హీరో అయినా రెండు మూడేళ్లు టైం కేటాయించాలి. ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు తన కంపౌండ్ కే పరిమితం అవ్వాలి. ఇదే విషయాన్ని క్యాచ్ చేసిన మహేష్ ఇప్పుడు కొత్త ప్లాన్ అప్లై చేస్తున్నాడట. రాజమౌళి ప్రాజెక్ట్ కంటే ముందు మరో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ఎవరో తెలుసా అనిల్ రావిపూడి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజెంట్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం చేస్తున్నాడు.షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీని తర్వాత రాజమౌళి తో ఓ పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు మహేష్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. పలు దఫాలుగా చర్చలు జరిపి కథకు ఒక రూపం ఇచ్చే పనిలో బిజీ అయ్యాడు జక్కన్న. తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన స్టోరీ ట్రీట్ మెంట్ సిద్ధం చేయడానికి ఎంత లేదన్నా ఇంకా ఆరేడు నెలలు టైం పడుతుంది. మహేష్ డిసెంబర్ కి గుంటూరు కారం ఫినిష్ చేసి ఖాళీ అవుతాడు. ప్రమెషన్స్ కోసం తిరిగినా సంక్రాంతికి ఫ్రీ అయిపోతాడు. రాజమౌళి సినిమా స్టార్ట్ అవ్వడానికి ఆగస్టు వరకు టైం పట్టేస్తుంది. ఈ గ్యాప్ లో ఓ సినిమా చేసే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్లు తెలుస్తోంది.
మహేష్ కెరీర్ లో సూపర్ ఫాస్ట్ దర్శకులు వీరే..?
మహేష్ కెరీర్ లో ఇప్పటికే వేగంగా సినిమాలు చేసింది ఇద్దరే. ఒకరు పూరి జగన్నాధ్. రెండు అనిల్ రావిపూడి. ఫస్ట్ ఆప్షన్ సాధ్యం కాదు. ఎందుకంటే పూరీ ఇప్పుడు రామ్ తో ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నాడు. ఇక రెండో ఆప్షన్ అనిల్ రావిపూడి. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాకి తుదిమెరుగులు దిగుతున్నాడు. దసరాకి రిలీజ్ చేస్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఇంకెవరితో ప్రకటించలేదు. కాబట్టి మహేష్ తో సినిమా చేసే అవకాశం తనకి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరు టైంలోనే మహేష్ కోసం ఇంకో పవర్ ఫుల్ సబ్జెక్టు తన వద్ద ఉందని హింట్ ఇచ్చాడు అనిల్. డేట్లు వరసగా ఇస్తే ఆరు నెలల్లో ఫస్ట్ కాపీ సిద్ధం చేస్తానని చెప్పాడు. అందుకే మహేష్-అనీల్ కాంబోని సెట్ చేస్తున్నాడట ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర. ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించేదాకా ఏమీ చెప్పలే కానీ, రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా రెండు, మూడేళ్ల టైం పడుతుంది. కాబట్టి రాజమౌళితో సినిమా కంటే ముందు మహేష్ మరో సినిమా చేయడం గ్యారెంటీ అని చెబుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.