SSMB 29 : మహేష్-రాజమౌళి సినిమాకి ముహూర్తం ఫిక్స్…
యావత్ దేశ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ మహేష్ బాబు – రాజమౌళి (Mahesh Babu–Rajamouli).

Mahesh-Rajamouli film's timing is fixed...
యావత్ దేశ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ మహేష్ బాబు – రాజమౌళి (Mahesh Babu–Rajamouli). ‘ఎస్.ఎస్.ఎమ్.బి.29’ (SSMB 29) వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ క్రేజీ మూవీ.. ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతోందా? అనే ఆతురతో ఉన్నారు ఆడియన్స్. వారందరి కోసం లేటెస్ట్ గా అదిరిపోయే అప్డేట్ అందించారు నిర్మాత కె.ఎల్. నారాయణ (KL Narayana).
ఆద్యంతం ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ అడ్వంచరస్ థ్రిల్లర్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళుతుందని క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ కె.ఎల్.నారాయణ. అసలు మహేష్, రాజమౌళి కాంబో కోసం 15 ఏళ్ల క్రితం తాను ప్రయత్నించానని.. అప్పుడు చేయాల్సి ఉన్న సినిమా ఇప్పుటికి సెట్ అయ్యిందని ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పారు కె.ఎల్.నారాయణ్. ఈమధ్యలో రాజమౌళికి ఎన్నో హాలీవుడ్ (Hollywood) ఆఫర్స్ వచ్చినా.. తనకు మాట ఇవ్వడంతోనే అవన్నీ కాదని తనతో సినిమా చేస్తున్నారని కె.ఎల్.నారాయణ అన్నారు. అంతేకాక మహేష్ మేకోవర్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ కు చేరుకోవడంతో ఘట్టమనేని అభిమానులు ఖుషి అవుతున్నారు. రాజమౌళి (Rajamouli) నెవర్ బిఫోర్ అనేలా ఈ సినిమాను తెరకెక్కిస్తాడని అంచనాలు పెట్టుకుంటున్నారు. పైగా బడ్జెట్ విషయంలో ఎక్కడ తగ్గకుండా నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఎస్‌ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో పట్టాలెక్కనున్న ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) కథ అందిస్తున్నారని నారాయణ చెప్పుకొచ్చారు. హాలీవుడ్ (Hollywood) నుంచి ఆఫర్లు క్యూ కట్టిన కేవలం తన కిచ్చిన మాట కోసం రాజమౌళి సినిమా చేస్తున్నాడన్నారు. తాజాగా బయటకు వచ్చిన ఓ క్రేజీ న్యూస్ తో అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు.