ప్రకాశం బ్యారేజ్ లో బొట్లు రాకపోవడం మెయిన్ రీజన్ ఇదే

ప్రకాశం బ్యారేజ్ లో బొట్లు ఇప్పుడు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నా ఏడు రోజుల నుంచి బొట్లు బయటకు రావడం లేదు. ఇప్పుడిప్పుడే ఈ విషయంలో కాస్త ముందు అడుగులు పడుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 16, 2024 | 02:39 PMLast Updated on: Sep 16, 2024 | 2:39 PM

Main Problem For Boats Rescue Operation

ప్రకాశం బ్యారేజ్ లో బొట్లు ఇప్పుడు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నా ఏడు రోజుల నుంచి బొట్లు బయటకు రావడం లేదు. ఇప్పుడిప్పుడే ఈ విషయంలో కాస్త ముందు అడుగులు పడుతున్నాయి. అండర్ వాటర్ లో కటింగ్స్ చేసిన తర్వాత వాటిని కదిలించడమే పెద్ద సమస్య అయింది. ఈ విషయంలో అనుభవం ఉన్న అబ్బులు అనే వ్యక్తిని అతని టీం ని విజయవాడ పిలిపించారు. వాళ్ళ సహకారం ఇక్కడ కీలకం అయింది. నిపుణుల బృందం అక్కడ కష్టపడుతోంది.

అసలు ఎందుకు ఆ బోట్లు బయటకు రావడం లేదనే దానిపై బ్యారేజ్ పై అనుభవం ఉన్న నిపుణులు ఓ కీలక విషయం చెప్పారు. ఆ బ్యారేజ్ గేట్ల వెనుక మరో రాతి కట్ట ఉంది…. 2002-03 మధ్యలో దాన్ని కట్టారు. భారీ వరదలు నేరుగా ప్రకాశం బ్యారేజ్ తాకకుండా అది రక్షిస్తుంది. ఒక్కో కట్ట టిప్పర్ లోడ్ కు సమానమైన భారీ రాళ్లతో కట్టారు.ఇబ్రహీంపట్నంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పని చేయాలంటే… ఇక్కడ 12 అడుగుల నీరు నిలబడాలి.

అందుకే బ్యారేజ్ గేట్లకు సమానంగా 10- 12 అడుగుల ఎత్తులో ఈ నిర్మాణం చేపట్టారు. గత 20ఏళ్లలో అందులో భారీగా బురద ఒండ్రు చేరి ఉంటుందట. గేట్లకి రాతి కట్టకి మధ్య చిక్కిన బోట్లు బయటకు రావడంలో అందుకే ఈ సమస్యలు వస్తున్నాయి అంటున్నారు నిపుణులు.