MALLAREDDY CONGRESS : కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి ! రేవంత్ సెగ మామూలుగా లేదు…

మాజీ మంత్రి మల్లారెడ్డికి (Mallareddy) ఇప్పుడు సీఎం రేవంత్ (CM Revanth Reddy) పెట్టిన సెగ బాగా తగులుతోంది. ఆయన కాలేజీలకు వెళ్ళే రోడ్డు కోసం HMDA భూములను ఆక్రమించారంటూ మొన్ననే అధికారులు ఆ రోడ్డును తవ్వేశారు. ఇప్పుడు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన... దుండిగల్ లోని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో (Aeronautical Engineering College) అక్రమ కట్టడాలను కూల్చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2024 | 01:11 PMLast Updated on: Mar 07, 2024 | 1:11 PM

Mallareddy Into Congress Revanth Sega Is Not Normal

మాజీ మంత్రి మల్లారెడ్డికి (Mallareddy) ఇప్పుడు సీఎం రేవంత్ (CM Revanth Reddy) పెట్టిన సెగ బాగా తగులుతోంది. ఆయన కాలేజీలకు వెళ్ళే రోడ్డు కోసం HMDA భూములను ఆక్రమించారంటూ మొన్ననే అధికారులు ఆ రోడ్డును తవ్వేశారు. ఇప్పుడు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన… దుండిగల్ లోని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో (Aeronautical Engineering College) అక్రమ కట్టడాలను కూల్చేశారు. చిన్నదామర చెరువు మీద కాలేజీ బిల్డింగ్ కట్టినట్టు అధికారులు చెబుతున్నారు. గత BRS హయాంలోనే స్థానికుల నుంచి ఎన్నో ఫిర్యాదులు వచ్చినా అధికారులు లైట్ తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) రావడంతో యాక్షన్ మొదలుపెట్టారు. ఈ కూల్చివేతలు… ఈ నిర్భంధాలు ఇంతటితో ఆగేటట్టు కనిపించట్లేదు. అందుకే మల్లారెడ్డి ఫ్యామిలీ ప్యాక్ మాట్లాడుకొని కాంగ్రెస్ లోకి దూరిపోవాలని డిసైడ్ అయ్యారు.

మల్లారెడ్డి త్వరలోనే గులాబీ బాస్ కి గుడ్ బై కొట్టి… హస్తం పార్టీలోకి జంప్ అవ్వాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ పిలుపు కోసం వెయ్యికళ్ళతో ఎదురు చూస్తున్నారు. మొన్నటిదాకా బీజేపీలోకి వెళ్ళేందుకు తీవ్రంగా ప్రయత్నించారు మల్లారెడ్డి. మల్కాజ్ గిరి ఎంపీ సీటు తన కొడుకు భద్రారెడ్డికి ఇప్పించాలని చూశారు. కానీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఆ టిక్కెట్ ఇవ్వడంతో… మల్లారెడ్డి ఇక కాంగ్రెస్ వైపు టర్న్ అయినట్టు తెలుస్తోంది. పైగా మల్లారెడ్డి బీజేపీలో చేరాలంటే… బీఆర్ఎస్ కు రిజైన్ చేయాలని కమలనాధులు కండీషన్ పెట్టారట. రిజైన్ చేయడానికి ఇష్టం లేక బీజేపీలో చేరిక ఆగిపోయింది.

బీజేపీలో కుదరకపోవడంతో కాంగ్రెస్ లో చేరడానికి మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈనెల 4న రాష్ట్ర మంత్రి ఒకరిని కలుసుకొని… మల్లారెడ్డి, భద్రారెడ్డి రహస్యంగా చర్చలు జరిపినట్టు సమాచారం. తన కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ ఇప్పించాలని రిక్వెస్ట్ చేశారట. రేవంత్ ఒప్పుకోకపోవచ్చని ఆ మంత్రి… మల్లారెడ్డికి ముఖం మీద చెప్పేశాడని అంటున్నారు. అటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా కూడా కాంగ్రెస్ లో చేరికకు రాయబారం నడుపుతున్నట్టు తెలిసింది. తన చిన్న కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి ద్వారా డీకే శివకుమార్ తో సంప్రదింపులు మొదలుపెట్టారట. డీకేను ఒప్పించగలిగితే ఈనెల 9న మేడ్చల్ నియోజకవర్గం కండ్లకోయలో జరిగే సీఎం రేవంత్ సభలోనే మల్లారెడ్డి అండ్ ఫ్యామిలీ కాంగ్రెస్ లో చేరతారని అంటున్నారు. లేదంటే ఈనెల 11న తన చిన్న కొడుకు భద్రారెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పించాలని ప్రయత్నాల్లో మల్లారెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.

మల్లారెడ్డి ఇప్పటికే BRS కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. LRS దరఖాస్తుదారులను ప్రభుత్వం మోసం చేసిందంటూ… గులాబీ పార్టీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు మల్లారెడ్డి డుమ్మా కొట్టారు. తన నియోజకవర్గం మేడ్చల్ లో కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాల్ చేసి అడిగితే… తాను సాయంత్రం వచ్చి కలుస్తానని మల్లారెడ్డి సమాధానం ఇచ్చారని అంటున్నారు.

మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు… రేవంత్ రెడ్డిని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఆరోపణలు, ఛాలెంజ్ లు… తొడగొట్టడాలు… బూతులు తిట్టడాలు ఇలాంటివి ఎన్నో చేశారు. ఇప్పుడు రేవంత్ ఆయన్ని కాంగ్రెస్ లో చేర్చుకోవడం కష్టమే అంటున్నారు కొందరు. BRS అవినీతి మీద పోరాడుతున్నామని చెప్పుకుంటున్న రేవంత్… మల్లారెడ్డిని చేర్చుకుంటే… ఆయన అవినీతి విషయంలోనూ రాజీపడినట్టు అవుతుంది. కానీ మల్లారెడ్డి మాత్రం… తన ఆస్తులపై దాడులు పెరిగిపోతుండటంతో… కాంగ్రెస్ లో చేరడమే బెటర్ అని డిసైడ్ అయ్యారు. పట్టువదలని విక్రమార్కుడిలా అన్ని రకాల పైరవీలు చేసుకుంటున్నారు.