INDIA bloc: ఇండియ కూటమి అధ్యక్షుడిగా ఖర్గే.. పదవి వద్దన్న నితీశ్ కుమార్..
శనివారం కూటమి పార్టీలు వర్చువల్‌గా సమావేశమై మల్లిఖార్జున్ ఖర్గేను తమ చైర్ పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. కూటమి చీఫ్ తర్వాత ఇందులో కీలకమైన పదవి కన్వీనర్. ఈ పదవి కోసం బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ పేరును ప్రతిపాదించి, ఆమోదించారు.
INDIA bloc: కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. అయితే, ఈ కూటమికి ఇంతకాలం అధ్యక్షుడు లేరు. కానీ, తాజాగా ‘ఇండియా’ కూటమి అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఎన్నుకున్నారు. కూటమి చీఫ్‌గా ఎవరిని నియమించాలనే విషయంలో పార్టీల మధ్య కొంతకాలంగా అనేక చర్చలు జరిగాయి. పలుమార్లు సమావేశమైనప్పటికీ ఒక స్పష్టత రాలేదు.
Ayodhya Ram Mandir: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట.. 22నే ఎందుకంటే!
శనివారం కూటమి పార్టీలు వర్చువల్‌గా సమావేశమై మల్లిఖార్జున్ ఖర్గేను తమ చైర్ పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. కూటమి చీఫ్ తర్వాత ఇందులో కీలకమైన పదవి కన్వీనర్. ఈ పదవి కోసం బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ పేరును ప్రతిపాదించి, ఆమోదించారు. అయితే, కన్వీనర్ పదవిని స్వీకరించడానికి నితీశ్ కుమార్ అంగీకరించలేదు. నితీశ్‌కు ఈ పదవి ఇవ్వడాన్ని కీలక పార్టీ అయిన టీఎంసీ వ్యతిరేకించింది. అందువల్లే నితీశ్ ఈ పదవిని తిరస్కరించారని సమాచారం. ప్రస్తుతం కూటమి చీఫ్, కన్వీనర్ వంటి పదవులకు నేతల్ని ఎన్నకున్నప్పటికీ.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు.. వర్చువల్‌గా సాగిన ఈ భేటీకి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరు కాలేదు.
ఈ సమావేశంపై మమతా బెనర్జీకి సమాచారం ఉందని, అయితే.. ముందస్తు అపాయింట్‌మెంట్లు ఉండడం వల్ల ఆమె హాజరు కాలేదని టీఎంసీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇండియా నేతల మధ్య రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి. కలిసి పోటీ చేసే అంశంపై పరిశీలన చేస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడమే లక్ష్యంగా, దేశ వ్యాప్తంగా ఉన్న 28 పార్టీలు ‘ఇండియా’ పేరుతో ఒక కూటమిగా ఏర్పడ్డ విషయం తెలిసిందే.