Mallu Bhatti Vikramarka: బీజేపీ, బీఆర్ఎస్ ప్రజల సంపద దోచుకున్నాయి: సీఎల్పీ నేత
బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల సంపదను దోచుకుంటున్నాయి. ప్రధాని మోడీ దేశ సంపదను అదానికి కట్టబెడుతున్నాడు. అదానీకి అక్రమంగా కట్టబెట్టిన ఆస్తులను బయటపెట్టిన రాహుల్ పై ప్రధాని మోడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు.

Mallu Bhatti Vikramarka: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, ఒకదానికొకటి మద్దతు ఇచ్చుకుంటున్నాయని విమర్శించారు మల్లు భట్టివిక్రమార్క. శనివారం ఆయన ముదిగొండ మండలం పండ్రేగి పల్లిలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. ‘‘మతాల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ బిజెపి.
Congress: కాంగ్రెస్ హామీలు అమలు చేయించే బాధ్యత రాహుల్ గాంధీది: ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు
దానికి మద్దతిస్తున్న పార్టీ బిఆర్ఎస్. బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల సంపదను దోచుకుంటున్నాయి. ప్రధాని మోడీ దేశ సంపదను అదానికి కట్టబెడుతున్నాడు. అదానీకి అక్రమంగా కట్టబెట్టిన ఆస్తులను బయటపెట్టిన రాహుల్ పై ప్రధాని మోడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. ముస్లింలఎకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని బిఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచిను మోసం చేసింది. పార్లమెంట్లో బీజేపీ ఏ చట్టం తెచ్చినా బిఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. బిఆర్ఎస్ చెప్తుంది బిజెపి చేస్తుంది.
ఓటమి భయంతో కాంగ్రెస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేయడానికి ఐటి, ఈడీ దాడులు చేయిస్తోంది బీఆర్ఎస్. దేశంలో ముస్లిం మైనార్టీలకు అండగా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీని ప్రతి రోజు తలుచుకోవాలి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్సార్ అత్యంత సన్నిహితులు, ఆత్మీయులు నా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సంతోషం. ఆనాడు వైఎస్ఆర్‌తో కలిసి పనిచేసిన ప్రతి విషయం ఈ సందర్భంగా గుర్తుకొస్తుంది. వైయస్ఆర్ తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వైయస్ఆర్ ఆత్మ ఎక్కడున్నా శాంతించాలి. వైయస్సార్ మార్గం, ఆయన చూపిన బాట, చెప్పిన ఆలోచనలో పనిచేస్తాం”అని భట్టి విక్రమార్క అన్నారు.