MALLU RAVI: కాంగ్రెస్ పార్టీ పదవికి మల్లు రవి రాజీనామా.. ఎందుకంటే
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన న్యూఢిల్లీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా సమర్పించినట్లు తెలిపారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్లు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఎక్స్ వేదికగా ఈ ప్రకటన చేశారు. అయితే, దీనికి కారణముంది.
MALLU RAVI: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి కీలక పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన న్యూఢిల్లీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా సమర్పించినట్లు తెలిపారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్లు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఎక్స్ వేదికగా ఈ ప్రకటన చేశారు. అయితే, దీనికి కారణముంది.
MLC KAVITHA: 26న కవిత అరెస్ట్ తప్పదా..? సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఏంటి..?
తాను నాగర్ కర్నూల్ ఎన్నికల బరిలో దిగబోతున్నట్లు వెల్లడించారు. అంటే.. నాగర్ కర్నూల్, కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ దాదాపు మల్లు రవికి వచ్చే అవకాశం ఉంది. మల్లు రవి రాజీనామా చేసింది ప్రభుత్వ నామినేటెడ్ పదవి. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన సలహాదారుగా ఉన్నారు. అంటే ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వానికి అధికార ప్రతినిధిగా పని చేస్తారు. రేవంత్ సర్కార్ నియమించిన నలుగురిలో ఆయన ఒకరు. గత జనవరి 28న మల్లు రవి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇక.. మల్లు రవి రాజీనామాను సీఎం ఆమోదిస్తారా.. ఈ పదవిలో కొనసాగిస్తూనే ఆయనను ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారా అన్నది తేలాలి.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టిక్కెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. అనేకమంది అధిష్టానానికి ఎంపీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్లు ఎవరికి దక్కుతాయనే ఆసక్తి నెలకొంది. మరి.. మల్లు రవికి సీటు ఖాయమేనా అన్నది మరికొద్ది రోజుల్లో తేలుతుంది.