పోలీసులకు సిఎం స్ట్రాంగ్ వార్నింగ్, మీకు చేతకాక పోతే సిబిఐకి ఇస్తా…!
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల వైద్యురాలిపై గత వారం జరిగిన అత్యాచారం-హత్య కేసును చేధించేందుకు పోలీసులకు ఆదివారం వరకు సమయం ఉంటుందని , లేని పక్షంలో సిబిఐకి కేసును అప్పగిస్తా అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసారు.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల వైద్యురాలిపై గత వారం జరిగిన అత్యాచారం-హత్య కేసును చేధించేందుకు పోలీసులకు ఆదివారం వరకు సమయం ఉంటుందని , లేని పక్షంలో సిబిఐకి కేసును అప్పగిస్తా అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ కేసు సిబిఐ కి ఇవ్వాలని బీజేపి ఒత్తిడి చేస్తున్న నేపధ్యంలో మమతా బెనర్జీ పై విధంగా వ్యాఖ్యలు చేసారు.
సిబిఐ సక్సెస్ రేటు తక్కువగా ఉన్నా సరే కేసుని వాళ్లకు అప్పగిస్తామన్నారు. సిబిఐ కేసుల్లో ఇప్పటి వరకు న్యాయం జరగలేదు అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి దొంగతనం వంటి సీబీఐ తీసుకున్న కేసులను ప్రస్తావిస్తూ సిబిఐ తీరుని తప్పుబట్టారు. ఆందోళన చేస్తున్న విద్యార్ధులు కేసుని సిబిఐకి అప్పగించాలని కోరితే దానికి తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఈ కేసులో ఎంత మంది ఉన్నా సరే అరెస్ట్ చేసి తీరాల్సిందే అని మమతా స్పష్టం చేసారు.