Manchu Manoj: మంచు మనోజ్ పెళ్లి డేట్ ఫిక్స్
ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడంతో.. కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య వీళ్లు పెళ్లి చేసుకోనున్నట్టు టాక్.
మంచు కుటుంబంలో ట్రోల్‌కు గురి కాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మంచు మనోజ్ మాత్రమే. చాలా తక్కువగా మీడియా ముందుకు వచ్చే ఈ హీరో.. మాట్లాడే కొన్ని మాటలు కూడా జాగ్రత్తగా, ఆలోచింపజేసేలా ఉంటాయి. చేసింది కొన్ని సినిమాలే అయినా.. జెన్యూన్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు మనోజ్.
అయితే తన వ్యక్తిగత జీవితం మాత్రం సరిగ్గా ఉండేది కాదు. మనస్పర్థల కారణంగా తన భార్య ప్రణతికి విడాకులు ఇచ్చాడు. తరువాత డిప్రెషన్‌కు గురై.. సినిమాలకు దూరమయ్యాడు. మళ్లీ నార్మల్ లైఫ్‌లోకి వచ్చేందుకు అహం బ్రహ్మాస్మి అనే సినిమా మొదలు పెట్టాడు. కానీ దురదృష్టవశాత్తూ అది కూడా మధ్యలోనే ఆగిపోయింది.
అయితే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ స్టార్.. కొంత కాలంగా ఏపీ దివంగత నేత భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికతో రిలేషన్‌లో ఉన్నాడు. భూమా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ ముందు నుంచీ చాలా క్లోజ్. భూమా మౌనిక కూడా తన భర్తతో విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగతంగా దాదాపు ఒకే పొజిషన్‌లో ఉన్న వీళ్లిద్దరూ కొంత కాలంగా రిలేషన్‌లో ఉన్నారు. మంచు మనోజ్ కూడా ఓ ప్రెస్‌మీట్‌లో తమ రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చాడు. టైం వచ్చినప్పుడు తానే అన్ని విషయాలు వివరిస్తానని చెప్పాడు. దీంతో వీళ్లిద్దరి ప్రేమ గురించి అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.
అయితే వీళ్లిద్దరూ కొన్ని రోజుల్లోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. మార్చ్ 3 న మంచు మనోజ్ భూమా మౌనిక మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారట. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడంతో.. కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య వీళ్లు పెళ్లి చేసుకోనున్నట్టు టాక్. మంచు లక్ష్మి ఇంట్లో వీళ్ల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కూడా నిర్వహించారట. అటు భూమా మౌనిక కుటుంబంలో కూడా చాలా విభేదాలు ఉన్నాయి. రాజకీయంగా, వ్యక్తిగత జీవితంలో మౌనికకు సపోర్ట్ ఇచ్చేవాళ్లు లేరు. ఈ విషయంలో కూడా మనోజ్ మౌనికకు సపోర్ట్ ఇచ్చి పాలిటిక్స్‌లో ఎంకరేజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.