Manchu Manoj : తండ్రి కాబోతున్న మంచు మనోజ్..
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. తన భార్య భూమా మౌనికారెడ్డి ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని తెలియజేశాడు. దివంగత భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ,
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. తన భార్య భూమా మౌనికారెడ్డి ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని తెలియజేశాడు. దివంగత భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. తన అత్తమ్మ భూమా పుట్టినరోజు సందర్భంగా ఆమెను గుర్తుచేసుకుంటూ ఈ గుడ్ న్యూస్ ను షేర్ చేసుకోగా.. వైరల్ గా మారింది. అన్నయ్యగా తనకు ప్రమోషన్ రానున్న తరుణంలో భూమా మౌనికా రెడ్డి కుమారుడు ధైరవ్ చాలా సంతోషంగా ఉన్నట్లు మంచు మనోజ్ తెలిపారు.
తన అత్తమ్మ, మావయ్య ఎక్కడున్నా తమను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారన్నారు. అలాగే తన తల్లి నిర్మల, తండ్రి మోహన్ బాబు ఆశీస్సులతో తమ కుటుంబం చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ పెళ్లి తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. అటు సినిమా, ఇటు బుల్లితెర షోతో బిజీగా ఉన్నారు. వాట్ ద ఫిష్ అనే సినిమా చేస్తున్నారు. అలాగే మంచు మనోజ్ ఉస్తాద్ అనే టీవీ షో కూడా చేస్తున్నారు.
మంచు మనోజ్ ఈ మధ్యనే భూమా నాగ మౌనిక రెడ్డి ని ప్రేమించి రెండో పెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ సంవత్సరం మార్చిలో ఇరువైపులా కుటుంబ పెద్దల సమ్మతితో వీరిద్దరి వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా మంచు మనోజ్ శుభవార్త చెప్పారు. త్వరలో తాను తండ్రిని కాబోతున్నానని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇది తమకు ఎంతో సంతోషకర సమయం అని, అందరూ తమ ఆశీస్సులు అందించాలని కోరారు. ఈ మేరకు మంచు మనోజ్ ట్వీట్ చేశారు. మొత్తానికి వీళ్ళ ప్రేమకు గుర్తుగా మరో బుజ్జాయి రాబోతున్నాడు.ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.