Manipur Remal cyclone : మణిపూర్ రెమాల్ తుపాన్ ఎఫెక్ట్.. భారీ వర్షాలకు ఉప్పొంగిన నదలు..
రెమాల్ తుపాను కారణంగా మణిపూర్ లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు సంభవించి అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
రెమాల్ తుపాను కారణంగా మణిపూర్ లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు సంభవించి అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత కొన్ని రోజులుగా మణిపూర్ లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి నదులు వాగులు, సరస్సులు అన్ని ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వరదలకు ఆ రాష్ట్రంలో ఇప్పటికే నలుగురు మరణించారు. 13 మంది గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఈ ఈశాన్య రాష్ట్రమంతా భారీ వరదలు వచ్చాయి. ఇంఫాల్ నగరం నుండి ప్రవహించే చాలా నదులు నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. మణిపూర్ రాష్ట్ర వ్యాప్తంగా 255 గ్రామాలలో 1,26,950 మంది ప్రభావితమయ్యారు. ఇప్పటి వరకు 16,364 ఇళ్లు దెబ్బతిన్నాయి. వరదల్లో చిక్కుకున్న 20,504 మంది ప్రజలను విపత్తు నిర్వహన సిబ్బంది సేఫ్ జోన్ లోకి తరలించారు. భారీ వర్షాలకు రాష్ట్రం వ్యాప్తంగా 522 హెక్టార్ల పంటలు నష్టపోయాయి.
ఈ అకాల వర్షాలకు కేవలం మూడు రోజుల్లో 292 కొండచరియలు విరిగిపడ్డాయి. బాధితుల కోసం 51 సహాయక శిబిరాలను ప్రారంభించినట్లు అధికారిక నివేదిక తెలిపింది. రెండు ప్రధాన నదులు ఇప్పటికే ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్ కాంగ్ పోక్పి, సేనాపతి, తౌబాల్, బిష్ణుపూర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా ఆ రాష్ట్ర విద్యా శాఖ మూడు రోజులు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. దీంతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్‌లోని ప్రధాన నదుల నీటిమట్టాలు ప్రమాదకర స్థాయిలోకి పెరుగుతుపోతున్నాయి.