Manipur: మణిపుర్ మండిపోతోంది.. గొడవలకు అసలు కారణం ఇదే..
మణిపుర్ స్టేట్ మండిపోతోంది. కుకీ, మతీ అనే రెండు తెగల మధ్య రిజర్వేషన్ విషయంలో మొదలైన ఇష్యూ.. ఇప్పుడు మణిపూర్‌ను షేక్ చేస్తోంది. ఈ గొడవల్లో 54 మంది చనిపోయారు. ఇది కేవలం అఫీషియల్‌గా వచ్చిన రిపోర్ట్ మాత్రమే. కానీ మృతుల సంఖ్య దీనికి మూడింతలు ఉందని ఇన్‌సైడ్ టాక్. స్టేట్‌లో సిచ్యువేషన్‌ను కంట్రోల్ చేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ మిలిటరీని రంగంలోకి దిపింది. 10 వేల మంది సైనికులు ఇప్పుడు మణిపుర్‌లో పహారా కాస్తున్నారు. ఓ పక్క సైన్యం, ఇంకో పక్క పారామిలిటరీ ట్రూప్స్ కలిసి సిచ్యువేషన్‌ను ఇప్పుడిప్పుడే కంట్రోల్‌లోకి తెస్తున్నాయి. హింసాత్మక ప్రాంతాల నుంచి 13 వేల మందిని శిభిరాలకు సేఫ్‌గా తరలించారు.
మణిపుర్‌లో చిక్కుకున్న మన తెలుగు స్టూడెంట్స్ కోసం గవర్నమెంట్ రెండు ఫ్లైట్‌లు ఏర్పాటు చేసింది. మణిపూర్‌లో పరిస్థితి ఇంత హింసాత్మకంగా మారడానికి కారణం.. ఆ స్టేట్ హైకోర్ట్ జారీ చేసిన ఓ ఆర్డర్. మణిపుర్ స్ట్రాటజిక్‌గా ఇండియాకు చాలా ఇంపార్టెంట్ స్టేట్. ఇక్కడ ఎక్కువగా సంచార జాతులకు చెందినవాళ్లే ఉంటారు. అందులో ఎక్కువగా ఉండేది మైతీలు. వీళ్లు ఇంఫాల్ లోయలో ఉంటారు. నాగా, కుకీ అనే తెగకు చెందిన వాళ్లు చుట్టూ కొండ ప్రాంతాల్లో ఉంటారు. కుకీలను, నాగాలను ఇక్కడ ఎస్టీలుగా గుర్తిస్తారు. వాళ్లకు 1/3 రిజర్వేషన్ కూడా ఉంది. మైతీలను మాత్రం ఓబీసీలుగా గుర్తిస్తారు. ఇప్పుడు మైతీలను కూడా ఎస్టీ జాబితాలో కలపాలనేది మైతీల డిమాండ్. చాలా రోజుల నుంచి ఇదే విషయంలో అక్కడ శాంతియుత ఆందోళనలను జరుగుతున్నాయి.
కొన్ని రోజలు నుంచి ఈ ఇష్యూ కోర్టులో కూడా ఉంది. రీసెంట్‌గానే ఈ విషయంలో కోర్ట్ ఓ ఆర్డర్ పాస్ చేసింది. మైతీలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలంటూ మణిపుర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతే.. ఒక్కసారిగా కుకీ, నాగా తెలగకు చెందిన ఎస్టీలు భగ్గుమన్నారు. మైతీలను ఎస్టీలుగా గుర్తిస్తే మా పరిస్థితి ఏంటంటూ రోడ్లపైకి వచ్చారు. ఆల్ మణిపుర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మైతీ తెగకు చెందిన విద్యార్థులు కూడా ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ఈ రెండు తెగల మధ్య మాటా మాటా పెరిగి అల్లర్లకు దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చాలా ప్రాంతాల్లో ఇళ్లు, షాపులు, వాహనాలకు నిప్పు పెట్టారు.
ఈ గొడవల్లోనే 54 మంది చనిపోయారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దీంతో సిచ్యువేషన్‌ను కంట్రోల్ చేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీని మోహరించింది. సిచ్యువేషన్ కంట్రోలోకి వచ్చినా.. ఈ రెండు తెగల మధ్య ఇష్యూ ఇప్పట్లో తేలేలా లేదు. మైతీలు అసలు లోకల్ వాళ్లు కాదని మయన్మార్ నుంచి వలస వచ్చారని అలాంటి వాళ్లను ఎస్టీలుగా ఎలా గుర్తిస్తారనేది నాగా, కుకీ తెగల వాదన. అంతే కాదు.. ఒకవేళ మైతీలను ఎస్టీలుగా గుర్తిస్తే కొండ ప్రాంతాల్లో భూములు కొనే హక్కు వాళ్లకు వస్తుంది. 1/3 ఉన్న రిజర్వేషన్ అందరికీ వర్తిస్తుంది. పోటీ పెరుగుతుంది.
సింపుల్‌గా చెప్పాలంటే మణిపుర్‌లో మైతీల డామినేషన్ పెరుగుతుంది. ఈ కారణంగానే నాగా,కుకీ తెగల ప్రజలు వాళ్లను ఎస్టీ జాబితాలో చేర్చొద్దని పట్టుబడుతున్నారు. కవరమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉంది ఇప్పుడు అక్కడి గవర్నమెంట్ పరిస్థితి. ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరో ఒకరి ఆగ్రహానికి గురి కాక తప్పదు. మరోపక్క మణిపుర్ రాష్ట్రం 5 దేశాలతో బోర్డర్ పంచుకుంటుంది. ఇలాంటి ప్రాంతంలో ఇంత సెన్సిటివ్ సిచ్యువేషన్‌ను హ్యాండిల్ చేయమంటే నిజంగా చాలా పెద్ద టాస్క్. చూడాలి మరి.. ఈ ఇష్యూను గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేస్తుందో.