Danam Nagender : ఏ రోటికాడ ఆ పాడ పాడతావా… ఇదేం పద్ధతి దానం అన్నా..
దానం నాగేందర్.. పొలిటికల్ జంపింగ్ స్టార్ అంటూ ట్రోలింగ్ చేస్తుంటారు చాలామంది. కాంగ్రెస్ నుంచి టీడీపీ.. టీడీపీ నుంచి కాంగ్రెస్.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్.. బీఆర్ఎస్ నుంచి మళ్లీ కాంగ్రెస్.. ఇలా దాదాపు అన్ని పార్టీలు కవర్ చేశారు దానం.
దానం నాగేందర్.. పొలిటికల్ జంపింగ్ స్టార్ అంటూ ట్రోలింగ్ చేస్తుంటారు చాలామంది. కాంగ్రెస్ నుంచి టీడీపీ.. టీడీపీ నుంచి కాంగ్రెస్.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్.. బీఆర్ఎస్ నుంచి మళ్లీ కాంగ్రెస్.. ఇలా దాదాపు అన్ని పార్టీలు కవర్ చేశారు దానం. పార్టీ సంగతి తర్వాత పదవులే ముఖ్యమని.. ఏ రోటికాడ ఆ పాట పాడడంలో.. దానం నాగేందర్‌ను మించిన వారు లేరు. ఇప్పుడు అదే జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం.. ఆ పార్టీలో కేటీఆర్‌కు చాలా క్లోజ్ అనే పేరు తెచ్చుకున్నారు. ఐతే గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో.. వెంటనే కాంగ్రెస్‌లో చేరిపోయారు. కేబినెట్ విస్తరణ వేళ.. ఇప్పుడు అదే బీఆర్ఎస్ మీద అటాకింగ్ మొదలుపెట్టారు.
బీఆర్ఎస్‌ను కేటీఆర్ కార్పొరేట్ కంపెనీ లాగా నడిపారని కేసీఆర్‌ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయిట్మెంట్ కూడా దొరికేది కాదని.. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉంటుందని.. బీఆర్ఎస్‌లో లేనిది అదే అంటూ దానం కామెంట్ చేశారు. ఇవే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. స్వేచ్ఛ గురించి మీరు చెప్పడం ఏంటి సార్ అంటూ.. నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దానం నాగేందర్ గత చరిత్రను తవ్వి తీస్తున్నారు. ఒకప్పుడు వైయస్ అనుచరుడిగా ముద్రపడిన దానం… సిటీ కాంగ్రెస్‌లో మంచి పట్టు ఉండేది. కాంగ్రెస్ తరపున సిటీలో ధర్నా లు చేయాలన్నా.. బంద్‌లు చేయాలన్నా.. బ్యానర్లు కట్టాలన్నా.. హోర్డింగుల్‌లు పెట్టాలన్నా.. దానం ఉండాల్సిందే! 1994, 1999లో ఆసిఫ్‌నగర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానంకు.. 2004లో కాంగ్రెస్ టికెట్ దొరకలేదు. అప్పుడు టీడీపీలో చేరి 24గంటల్లో టికెట్ తెచ్చుకున్నారు. కాంగ్రెస్ హోరులోనూ ఆసిఫ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలవగలిగాడు. ఐతే అప్పుడు వైఎస్ సర్కార్ ఏర్పాటు కావడంతో.. టీడీపీకి రాజీనామా చేసి సొంతగూటికి వచ్చేశారు. ఐతే బైపోల్‌లో ఓడిపోయారు. గెలిస్తే మంత్రి అయ్యేవారు. 2009లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి.. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా చేశాడు.
తెలంగాణ ఉద్యమం రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకొని కేసీఆర్‌ను హైదరాబాదు రోడ్లపై ఉరికించి కొడతానన్నాడు నాగేందర్. రాష్ట్రం విడిపోయాక 2014లో ఖైరతాబాద్‌లో ఓడిపోయారు. 2018లో వ్యూహాత్మకంగా బీఆర్ఎస్‌లో చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇక ఆ తర్వాత హోర్డింగ్‌ల రూపంలో దానం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కేసీఆర్ కొత్త దేవుడు అనే రేంజ్‌లో జోకడం మొదలుపెట్టారు దానం. 2023 ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్ల దయతో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో.. రూట్ మార్చారు దానం. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొదటి రోజు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సక్సెస్ అయ్యారు. విచిత్రం ఏంటంటే.. కాంగ్రెస్‌లో చేరడానికి పది నిమిషాల ముందు కూడా.. తాను బీఆర్ఎస్‌లోనే ఉంటానని అన్నారు. కట్ చేస్తే పది నిమిషాల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్న సీన్.. ఇప్పటికీ జనాల కళ్ల ముందు కదులుతుంటుంది.
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న దానం.. ఇప్పుడు బీఆర్ఎస్ మీద, కేసీఆర్, కేటీఆర్ మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కేసీఆర్‌ది రాచరికం అని.. కేటీఆర్ కార్పొరేట్ లీడర్ అని.. ఆ పార్టీలో స్వేచ్ఛ లేదని అంటున్నారు. ఇదే ఇప్పుడు దానంను టార్గెట్ చేసేలా చేస్తోంది. బీఆర్ఎస్ గురించి ఇంత తెలిసి.. ఐదేళ్లు ఎందుకు పార్టీలో ఉన్నావ్.. తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం అవుతున్న వేళ.. ఎందుకు ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతున్నావ్ అంటూ.. నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇది కాదా ఏ రోటికాడ ఆ పాట అంటే అని నిలదీస్తున్నారు.