Hidma Encounter: మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. అగ్రనేత హిడ్మా హతం..?
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో మావోయిస్టు అగ్రనేతగా ఉన్న హిడ్మా మోస్ట్ వాంటెండ్ లిస్టులో ఉన్నాడు. అతడి కోసం మూడు రాష్ట్రాల పోలీసులు చాలా కాలంగా వెతుకుతున్నారు. అతడిపై రూ.14 లక్షల రివార్డు ఉంది.
Hidma Encounter: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్, మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, బాలాఘాట్ జిల్లా ఖాంకోదాదర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా చనిపోయినట్లు ఆ రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. అయితే, హిడ్మా మరణంపై మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో మావోయిస్టు అగ్రనేతగా ఉన్న హిడ్మా మోస్ట్ వాంటెండ్ లిస్టులో ఉన్నాడు.
PRAJAVANI TENSION: ప్రజావాణితో కొత్త టెన్షన్.. భారీ క్యూలైన్లతో జనం పరేషాన్.. పరిష్కారం ఏంటి..?
అతడి కోసం మూడు రాష్ట్రాల పోలీసులు చాలా కాలంగా వెతుకుతున్నారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో మధ్యప్రదేశ్ పోలీసులకు చెందిన హాక్ ఫోర్స్ సిబ్బంది బాలాఘాట్ జిల్లా, ఖామ్‌కోదాదర్ అటవీ ప్రాంతంలో హిడ్మాను హతమార్చాయి. అయితే, మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటనా రాకపోవడంతో హిడ్మా మరణంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కారణం.. గతంలో కూడా ఎన్‌కౌంటర్లలో హిడ్మా చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రచారం జరిగిన కొద్ది రోజులకే తాను బతికే ఉన్నానంటూ హిడ్మా నుంచి ప్రకటన వెలువడేది. దాంతో హిడ్మా బతికే ఉన్నాడని తెలిసి, పోలీసులు షాకయ్యేవారు. నిజానికి హిడ్మా ఎలా ఉంటాడో బయటి వాళ్లెవరికీ తెలీదు. ఎవరూ ప్రత్యక్షంగా చూడలేదు. బయట ప్రపంచానికి కనిపించిందీ లేదు. కానీ, హిడ్మాకు దాదాపు 40 ఏళ్లు ఉంటాయని, బక్కపలచని దేహంతో చాలా మృదువుగా మాట్లాడుతాడని అతడి గురించి తెలిసినవాళ్లు చెబుతుంటారు.
దాదాపు పదేళ్లుగా దండకారణ్యంలో మావోయిస్టులు పాల్పడిన అనేక దాడుల వెనుకు ఉన్నది హిడ్మానే అని పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు హిడ్మా. అతడిపై రూ.14 లక్షల రివార్డు ఉంది. హిడ్మా స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లా మిర్తుర్. 1996లో తన 17 ఏళ్ల వయసులోనే హిడ్మా మావోయిస్టు పార్టీలో చేరాడు. అతడు చదివింది 7వ తరగతి మాత్రమే. దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి, నాయకుడి స్థాయికి ఎదిగాడు.