Shanmuk jaswanth : డిప్రెషన్ వల్లే గంజాయి అట..!
షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswant).. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ యూట్యూబర్ (YouTuber) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య లాంటి వెబ్ సిరీస్ (Surya Web Series) లతో మంచి గుర్తింపు సంపాదించి, బిగ్ బాస్ షో (Bigg Boss Show) తో మరింతగా పాపులారిటీ సంపాదించిన ఈ కుర్రాడు.

Marijuana is because of depression..!
షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswant).. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ యూట్యూబర్ (YouTuber) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య లాంటి వెబ్ సిరీస్ (Surya Web Series) లతో మంచి గుర్తింపు సంపాదించి, బిగ్ బాస్ షో (Bigg Boss Show) తో మరింతగా పాపులారిటీ సంపాదించిన ఈ కుర్రాడు. తరచుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. ఆ మధ్య మద్యం తాగి కారు నడిపి పోలీసులకు దొరికిపోవడంతో వార్తల్లో నిలిచాడు. ఇంతలోనే మరోవివాదంలో చిక్కుకున్నాడు. రీసెంట్‌గా తన ఇంట్లో గంజాయితో సహా పోలీసులకు పట్టుబడి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు..
గంజాయి కేసులో షణ్ముఖ్ అరెస్ట్ అవ్వడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన సోదరుడు సంపత్ వినయ్ ఓ యువతిని మోసం చేసిన కేసులో షణ్ముఖ్ గంజాయితో పట్టుబడ్డాడు. ఈ కేసులో అరెస్టయి.. బెయిల్ మీద బయటికి వచ్చాడు షణ్ముఖ్.. అయితే.. షణ్ముఖ్ సోదరుడి ఫ్లాట్‌కు పోలీసులు వెళ్లినపుడు సోదాల్లో గంజాయి పట్టుబడగా.. ఆ సమయంలో లేడీ పోలీస్‌తో షణ్ముఖ్ ఏడుస్తూ మాట్లాడిన అస్పష్ట వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వీడియోలో నేనే డిప్రెషన్ లో ఉన్నా.. సూసైడ్ చేసుకుందామనుకున్నా అని షణ్ముఖ్ చెబుతున్నాడు. తన పరిస్థితి బాలేదని చెబుతూ షణ్ముఖ్ ఏడుస్తున్నట్లుగా ఆ వీడియోలో అస్పష్టంగా ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే.. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డిప్రెషన్లో ఉండడం వల్లే గంజాయి తీసుకుంటున్నానంటూ షణ్ముఖ్ సింపథీ గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచంలో ఎవరికీ సమస్యలు లేవా..? డిప్రెషన్‌లో ఉన్న వాళ్లందరూ గంజాయి తీసుకుంటున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఐతే డిప్రెషన్లో ఉంటే మానసిక వైద్యుల దగ్గరికి వెళ్లాలి కానీ.. గంజాయి తీసుకోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ మధ్య కాలంలో షణ్నూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడినప్పుడు కూడా డ్రగ్స్ తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు గంజాయితో దొరికిపోయాడు. దీంతో.. అసలు ఈ అబ్బాయికి ఏమైంది..? ఎందుకు ఇలా లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నాడు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.