Facebook: సోషల్ మీడియా సంచలనం.. ఫేస్‌బుక్‌కు ఇరవై ఏళ్లు..

ఫేస్‌బుక్‌ రాకముందు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఉండేవి. కానీ, వాటిలో ఫేస్‌బుక్‌ ఒక సంచలనం సృష్టించింది. మనిషికి, మనిషికి ఉండే దూరాన్ని తగ్గించింది ఫేస్‌బుక్‌. ఒక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ఏ స్థాయిలో దూసుకెళ్లగలదో, కోట్లాదిమందిని ఎలా కనెక్ట్ చేయగలదో నిరూపించింది ఫేస్‌బుక్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 1, 2024 | 08:10 PMLast Updated on: Feb 01, 2024 | 8:10 PM

Mark Zuckerbergs Facebook The Social Network Old Timer Turning 20

Facebook: ఈ డిజిటల్ యుగంలో ఫేస్‌బుక్ గురించి తెలియని వాళ్లు చాలా అరుదు. సోషల్ మీడియాలో ఒక సంచలనం సృష్టించింది ఫేస్‌బుక్‌. ఈ ప్లాట్‌ఫాం అందుబాటులోకి వచ్చి ఇప్పటికి ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి. అమెరికాకు చెందిన మార్క్ జుకర్‌బర్గ్.. 2004, ఫిబ్రవరిలో ఫేస్‌బుక్‌‌‌ను ప్రారంభించారు. ఇప్పటికీ టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఒకటిగా కొనసాగుతోంది.

Bharat Rice: రేపటినుంచి మార్కెట్లోకి రాబోతున్న భారత్ రైస్.. కేజీ రూ.29..
సంచలనం.. 200 కోట్ల మంది యూజర్లు..
ఫేస్‌బుక్‌ రాకముందు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఉండేవి. కానీ, వాటిలో ఫేస్‌బుక్‌ ఒక సంచలనం సృష్టించింది. మనిషికి, మనిషికి ఉండే దూరాన్ని తగ్గించింది ఫేస్‌బుక్‌. ఒక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ఏ స్థాయిలో దూసుకెళ్లగలదో, కోట్లాదిమందిని ఎలా కనెక్ట్ చేయగలదో నిరూపించింది ఫేస్‌బుక్‌. యూజర్లను స్నేహితులుగా మార్చింది. ప్రారంభమైన ఏడాదిలోనే పది లక్షల మంది ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అంతకుముందున్న మైస్పేస్ అనే ప్లాట్‌ఫాంను దాటేసింది. స్నేహితుల్ని ట్యాగ్ చేయడం, రిక్వెస్టులు పంపడం, యాక్సెప్ట్, సెర్చ్ వంటి వాటి ద్వారా కోట్లాదిమంది యూజర్లను సంపాదించుకుంది. నిజానికి అప్పటికి ఆన్‌లైన్ అంతంతమాత్రంగానే అందుబాటులో ఉండేది. కానీ, ఫేస్‌బుక్‌ మాత్రం దూసుకెళ్లింది. 2012 నాటికి 100 కోట్ల యూజర్లను సంపాదించింది. 2021లో 192 కోట్లకు చేరింది. అయితే, ఒక దశలో యూజర్ల సంఖ్య పడిపోయింది. తర్వాత నెమ్మదిగా పుంజుకుంది. 2023 చివరినాటికి సగటున రోజువారీ యూజర్ల సంఖ్య 200 కోట్ల మందికి పైగా ఉన్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్య తగ్గింది.

వ్యసనంగా మారిన ఫేస్‌బుక్
రెండు దశాబ్దాలు గడిచేసరికి ఫేస్‌బుక్ చాలామందికి ఒక అలవాటుగా, ఇంకొందరికి వ్యసనంగా మారింది. కొందరు ఫేస్‌బుక్ వాడకుండా ఒక్క రోజు కూడా ఉండలేరు. ఫేస్‌బుక్‌‌లో ఫొటోలు, వీడియోల షేరింగ్, లైక్స్, కామెంట్లు వంటి వాటి కోసం యూజర్లు ప్రయత్నిస్తుంటారు. అయితే, దీనివల్ల ప్రైవసీ సమస్యలున్నాయని నిపుణులు చెబుతున్న మాట. క్రమంగా ఫేస్‌బుక్‌కు ఆదరణ తగ్గుతుండటంతో అనుబంధంగా ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా తీసుకొచ్చింది మెటా సంస్థ. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌కే ఆదరణ ఎక్కువగా ఉంది. ఈ రెండూ జుకర్‌బర్గ్‌కు సంబంధించిన మెటా సంస్థకు చెందినవే. సమాచారం, వినోదంతోపాటు రాజకీయ ప్రచారాలకు కూడా ఫేస్‌బుక్ వేదికగా మారింది. రాజకీయాలు, ఫేక్ సమాచారం, ప్రచారం వంటి అంశాలపై ఫేస్‌బుక్‌పై అనేక ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టూల్స్, ఇతర యాప్స్ వంటివి ఫేస్‌బుక్‌కు గట్టి పోటీ ఇస్తున్నాయి. అయినప్పటికీ.. ఫేస్‌బుక్ ఆన్‌లైన్ యూజర్ల జీవితాల్లో విడదీయరాని బంధం.