Pushpa-2 teaser : బన్నీ ఫ్యాన్స్ కు మాస్ జాతరే

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 (Pushpa 2) టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఐకాన్ స్టార్ (Icon star ) అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2024 | 12:13 PMLast Updated on: Apr 08, 2024 | 12:13 PM

Mass Jatare For Bunny Fans

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 (Pushpa 2) టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఐకాన్ స్టార్ (Icon star ) అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. దుమ్మురేపుతోంది టీజర్. సుకుమార్ (Sukumar) మరోసారి తన మార్క్ టేకింగ్ తో అదరగొట్టాడు. ఇక విడుదలైన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతూ.. వ్యూస్ ను సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది.

ఇక టీజర్ విషయానికి వస్తే.. 1:08 నిమిషాలు ఉన్న ఈ టీజర్ లో కేవలం గంగమ్మ తల్లి జాతరకు సంబంధించిన సీన్స్ మాత్రమే చూపించారు. అమ్మవారి వేశంలో బన్నీ విశ్వరూపం చూపించాడు. రాక్షసులను సంహరించే అవతారంలో బన్నీ సృష్టించిన వీరంగానికి థియేటర్లు తగలబడిపోవాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. పుష్పా 2కు ఈ గంగమ్మ తల్లి జాతర సీనే హైలెట్ అని టీజర్ చూస్తేనే తెలుస్తోంది.

రెండు నేషనల్ అవార్డులు రావడంతో పుష్ప సీక్వెల్ పై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు. ఎప్పుడు వచ్చినా సినిమా 1000 కోట్లు కొల్లగొడుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. రీసెంట్ గా రిలీజైన టీజర్ టాలీవుడ్ తో పాటు అన్ని వుడ్ లలోనూ సంచలనం సృష్టించింది. అంతేకాకుండా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. టీజర్ చాలా స్టైలిష్ గా, గ్రాండియర్ గా ఉండాలనుకుంటున్నారు. కానీ బన్నీ మాత్రం అమ్మవారి గెటప్ లో కనిపించి అందరినీ షాక్ కు గురి చేశాడు. అమ్మవారి గెటప్ లో ఊచకోతను మొదలు పెట్టాడు బన్నీ.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ముందు చెప్పినట్లుగానే ఆగస్టు 15న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సుక్కు సైతం బన్నీ ను ఈ సారి మాములుగా చూపించట్లేదని ఇన్ సైడ్ టాక్. ఈ సారి బన్నీ వెయ్యి కోట్లు కొల్లగొట్టడం పక్కా అని అభిమానులు ధీమాగా ఉన్నారు. మరోవైపు సుకుమార్ కేవలం ఇంటర్వెల్ సీన్ కే 50 కోట్లు ఖర్చు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఒక్క ఫైట్ సీన్ కోసమే అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారంటే మాములు విషయం కాదు.