Prabhas : మాస్ కా బాప్.. 50 కోట్లు.. నైజాం కింగ్‌గా ప్రభాస్

బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే.. బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఇలా ఉంటుందని చూపిస్తోంది సలార్ సినిమా. ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్.. థియేటర్లో ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బాక్సాఫీస్ వసూళ్ల దగ్గర మోత మోగిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2023 | 01:10 PMLast Updated on: Dec 27, 2023 | 1:10 PM

Mass Ka Baap 50 Crores Prabhas As Nizam King

బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే.. బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఇలా ఉంటుందని చూపిస్తోంది సలార్ సినిమా. ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్.. థియేటర్లో ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బాక్సాఫీస్ వసూళ్ల దగ్గర మోత మోగిస్తోంది. ఊహించినట్టుగానే సలార్ డే వన్ లెక్కలు రికార్డ్ రేంజ్‌లో ఉన్నాయి. సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ 178 కోట్లు వచ్చాయి. రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లో సలార్ భారీ ఓపెనింగ్స్ అందుకుంది.

నైజాంలో నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్ క్రియేట్ చేసింది. నాలుగు రోజుల్లో 450 కోట్లు రీచ్ అయిన సలార్.. ఐదు రోజుల్లో 500 కోట్ల మార్క్ రీచ్ అవనుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో దుమ్ములేపోతోంది సలార్. ముఖ్యంగా నైజాం ఏరియాలో మొదటి రోజు 22.55 కోట్ల షేర్‌ని రాబట్టింది సలార్. డే వన్‌తో నైజాంలో సలార్ నాన్ RRR రికార్డుని సెట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నైజాంలో 23.35 కోట్ల షేర్‌తో టాప్ ప్లేస్‌లో ఉంది ఆర్ఆర్ఆర్. ఇక ఇప్పుడు నైజాం ఏరియాలో నాన్ రాజమౌళి రికార్డు బద్దలు కొట్టింది. ఒక్క నైజాం ఏరియాలో మూడు రోజుల్లోనే దాదాపు 44.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక నాలుగు రోజులకు 50 కోట్లకు పైగా షేర్ సాధించి నాన్ రాజమౌళి రికార్డు సృష్టించింది సలార్. ఇప్పటివరకు బాహుబలి 2 సినిమా మొత్తం రన్‌లో గాను 68 కోట్ల షేర్ అందుకొని కొత్త రికార్డు సెట్ చేసింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్లీ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమానే 111 కోట్ల షేర్ సాధించి ఆల్ టైం రికార్డ్‌ని మళ్ళీ సెట్ చేసింది.

ఇక ఇప్పుడు నైజాం ఏరియాలో 50 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ అందుకొని.. రికార్డ్ క్రియేట్ చేసింది సలార్. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. సలార్ మేనియా ఇలాగే ఉంటే.. ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ను బీట్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. మరి నైజాంలో సలార్ ఫిగర్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.