Bollywood Animal Movie Rights : హాట్ కేక్ లా అమ్ముడు పోయిన రణబీర్-యానిమల్ రైట్స్..
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మసాలా మూవీ 'యానిమల్'. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఓ రేంజ్ లో రచ్చ చేసిన విషయం తెలిసిందే..

Mass masala movie Animal is being directed by Sandeep Reddy Vanga starring Bollywood star Ranbir Kapoor
సినిమాలో కంటెంట్ ఉంటే రైట్స్ కోసం పోటీ పడతారు డిస్ట్రీబ్యూటర్స్. భారీ రేట్ కోడ్ చేసి రైట్స్ ని దక్కించుకుంటారు. ఇప్పుడు ఇలాంటి వాటికే సెంటర్ అయింది యానిమల్ ప్రాజెక్ట్. భారీ ధరకి తెలుగు రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
మాస్ మసాలా మూవీ ‘యానిమల్’
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మసాలా మూవీ ‘యానిమల్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఓ రేంజ్ లో రచ్చ చేశాయి. ముఖ్యంగా ప్రీ టీజర్ లో మాస్క్ పెట్టుకొని ఒక రౌడీ గ్రూప్ ని రణబీర్ గొడ్డలితో నరుకుతూ రక్తపాతం సృష్టించిన తీరు బాలీవుడ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. టీజరే ఇలా ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అన్న చర్చ జరుగుతోంది. దానికి తగ్గట్టే ఈ ప్రాజెక్టును డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
యానిమల్ తెలుగు బిజినెస్ పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దిల్ రాజు 15 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే టాలీవుడ్ లో ఈ సినిమా హిట్ అవ్వాలంటే 25 కోట్లకు పైగా గ్రాస్ సాధించాల్సి ఉంటుంది. యానిమల్ పై ఇప్పుడున్న హైప్ చూస్తుంటే ఫస్ట్ వీకెండ్లోనే ఈ నెంబర్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ రెడ్డి నుండి వస్తున్న సినిమా కావడంతో ‘యానిమల్’ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సౌత్ ఆడియాన్స్. మొత్తానికి ‘యానిమల్’ తో దిల్ రాజుకి మంచి లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.