Russia Terrorist Attack : రష్యా దేశంలో భారీ ఉగ్రదాడి.. 60 మంది మృతి.. ముందే హెచ్చరించిన అమెరికా..
ప్రపంచంలోనే అతి పెద్ద దేశం అయిన రష్యాలో (Russia ) భారీ ఉగ్రదాడి (Terrorist Attack) కలకలం రేపుతోంది. రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు నరమేధం సృష్టించి. రష్యా క్యాపిటల్ మాస్కో (Moscow) సమీపంలోని ఓ మ్యూజిక్ ప్రోగ్రాం లో భారీ ఉగ్రదాడికి పల్పడ్డారు ఉగ్రవాదులు.
ప్రపంచంలోనే అతి పెద్ద దేశం అయిన రష్యాలో (Russia ) భారీ ఉగ్రదాడి (Terrorist Attack) కలకలం రేపుతోంది. రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు నరమేధం సృష్టించి. రష్యా క్యాపిటల్ మాస్కో (Moscow) సమీపంలోని ఓ మ్యూజిక్ ప్రోగ్రాం లో భారీ ఉగ్రదాడికి పల్పడ్డారు ఉగ్రవాదులు. ఈ దాడిలో 60 మందికి పైగా చనిపోగా, మరో 145 మంది వరకు గాయపడ్డారు. బాధితుల్లో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారని పేర్కొంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) తెలిపింది. ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ఈ కన్సర్ట్ హాల్‌లో ప్రొగ్రాం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత హాల్‌లోకి ప్రవేశించిన సాయుధులు కాల్పులు జరుపుతూ, బాంబులు విసరుతూ బీభత్సం సృష్టించారు.
సరైన సమయం చూసి.. సంగీత కార్యక్రమం పూర్తయ్యి అందరూ బయటకు వెళ్తున్న క్రమంలో.. దుండగులు భవనంలోకి ప్రవేశించి తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఒక్కసారిగా ఈ దాడితో అక్కడ ఉన్నవారందరు అవాకయ్యారు. ఏం చేయ్యలో అని ఆలోచించిలోపు ఉగ్రవాదుల తుటాలతో.. ప్రజలు నేలకొరిగారు. ఆ దృశ్యాలను చూసిన మరి కొందరు భయాందోళనతో సీట్ల మధ్య దాక్కున్నారు. ఈ కాల్పుల సమయంలో హాల్ లో 5వేల మందికిపైగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిలో అనేక మందికి తుపాకీ తూటాలు తగిలి అక్కడికక్కడే మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
ఈ ఘటన తరువాత మాస్కోలోని విమానాశ్రయాలు, స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘటనపై అమెరికా అధ్యక్ష భవనం స్పందించింది.. ఘటన దృశ్యాలు భయకరంగా ఉన్నాయని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జన్ కిర్బీ తెలిపారు. దాడి జరిగే అవకాశం ఉన్నట్లు తాము రష్యాను ముందే హెచ్చరించామని అన్నారు.
ఈ భారీ ఉగ్రదాడిపై.. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మారియా జఖరోవా (Maria Zakharova) మాట్లాడుతూ.. ప్రపంచ సమాజం మొత్తం ఈ దారుణమైన ఘటనను ఖండిస్తోంది. ప్రజలను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత్, పాకిస్థాన్, బెలారస్, టర్కీ, స్పెయిన్, మాంటెనెగ్రో, యూఏఈ, ఖతార్, ఉజ్బెకిస్థాన్, మాల్టా, చెక్ రిపబ్లిక్ వంటి దేశాలు ఖండించాయి.
SURESH. SSM