ఈ జోరు కొనసాగనీ.. ఆల్‌టైమ్ రికార్డుపై నితీశ్ గురి
ఆస్ట్రేలియా టూర్ కు అనూహ్యంగా ఎంపికైన తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. కోచ్ గంభీర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కీలక ఆల్ రౌండర్ గా ఎదిగేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాడు.
ఆస్ట్రేలియా టూర్ కు అనూహ్యంగా ఎంపికైన తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. కోచ్ గంభీర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కీలక ఆల్ రౌండర్ గా ఎదిగేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఈ క్రమంలో పెర్త్ టెస్టుతో పాటు పింక్ బాల్ టెస్టులోనూ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులు కూడా నమోదు చేశాడు. ప్రస్తుతం జట్టులో పేస్ ఆల్ రౌండర్ గా తన స్థానం సుస్థిరం చేసుకోవాలంటే నితీశ్ కుమార్ రెడ్డి మిగిలిన టెస్టుల్లోనూ ఇదే జోరు కొనసాగించాలి. రెండో టెస్ట్‌లో ఆడిన రెండు ఇన్నింగ్స్‌లలో అతడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన నితీష్ ఏ మాత్రం తడబడకుండా భారీ షాట్లను అలవోకగా ఆడుతూ.. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నడు.
అయితే నితీశ్ రెడ్డి మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. మరో ఆరు సిక్సర్లు సాధిస్తే ఆస్ట్రేలియాలో టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన పర్యాటక జట్టు బ్యాటర్‌గా నితీశ్ చరిత్ర సృష్టిస్తాడు. కంగారూల గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్‌లో క్రిస్ గేల్, వివ్ రిచర్డ్స్ 12 సిక్సర్లు సాధించి సంయుక్తంగా రికార్డు కొనసాగిస్తున్నారు. కాగా, తొలి రెండు టెస్టుల్లోనే నితీశ్ ఏడు సిక్సర్లు బాదాడు. ప్యాట్ కమిన్స్, స్కాట్ బొలాండ్ బౌలింగ్‌లో రెండేసి సిక్సర్లు, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, లబుషేన్ బౌలింగ్‌లో ఒక్కో సిక్సర్ బాదాడు.
ఈ క్రమంలో ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలింగ్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన భారత బ్యాటర్‌గా నితీశ్ రెడ్డి మరో అరుదైన ఘనత అందుకున్నాడు. పేస్ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు జహీర్ ఖాన్, రిషభ్ పంత్, అజింక్య రహానె, రోహిత్ శర్మల పేరిట సంయుక్తంగా ఉండేది. ఈ ఆటగాళ్లంతా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు చొప్పున బాదారు.
ఇక ఓవరాల్‌గా స్పిన్-పేస్‌లో ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రిషభ్ పంత్-రోహిత్ శర్మ , వీరేంద్ర సెహ్వాగ్ టాప్-3లో ఉన్నారు. మూడో టెస్టులో కనీసం సెహ్వాగ్ రికార్డును నితీశ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. కాగా భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి గబ్బా స్టేడియం వేదికగా మొదలవుతుంది.