Medaram Jatara 2024: సారీ సమ్మక్క.. మొగుడు బెట్టింగ్ మానేయాలని సమ్మక్కకు ముడుపు
ఈ లెక్కింపులో వింత వింత చీటీలు, చెల్లింపులు చూసి సిబ్బంది షాకవుతున్నారు. హుండీ లెక్కిస్తున్న సిబ్బందికి అందులో ఓ చీటీ కనిపించింది. ఏంటా అని ఓపెన్ చేస్తే.. ఓ భక్తురాలు తన కోర్కెను చీటీ రూపంలో రాసి హుండీలో వేసింది.
Medaram Jatara 2024: దక్షిణాది కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతంగా ముగిసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు మేడారం జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ముగియడంతో అమ్మవార్ల హుండీలను లెక్కించే పని మొదలు పెట్టింది రాష్ట్ర ఎండోమెంట్ శాఖ. హనుమకొండలోని టీటీడీ కళ్యాణమండపంలో అమ్మవార్ల హుండీలను లెక్కిస్తున్నారు.
CHANDRABABU NAIDU: ఏపీ సచివాలయం తాకట్టు.. జగన్‌పై చంద్రబాబు విమర్శలు
ఈ లెక్కింపులో వింత వింత చీటీలు, చెల్లింపులు చూసి సిబ్బంది షాకవుతున్నారు. హుండీ లెక్కిస్తున్న సిబ్బందికి అందులో ఓ చీటీ కనిపించింది. ఏంటా అని ఓపెన్ చేస్తే.. ఓ భక్తురాలు తన కోర్కెను చీటీ రూపంలో రాసి హుండీలో వేసింది. తన భర్త బెట్టింగ్ మానేసేలా తల్లి దీవించాలని.. తన భర్త మనసు మార్చాలంటూ చీటీలో రాసింది. అంతే కాదు.. తన అక్క కొడుక్కి ఐఐటీలో సీట్ రావాలంటూ కూడా చీటీ రాసి హుండీలో వేసింది. ఇది చూసిన సిబ్బంది నవ్వాలో ఏడవాలో అర్థం కాక షాకైపోయారు. లెక్కింపు ప్రారంభించిన రోజు కూడా ఇలాంటిదే మరో ఘటన జరిగింది. ఎవరో భక్తులు అంబేద్కర్ ఫొటోతో ఉన్న ఫేక్ నోట్లను అమ్మవారి హుండీలో వేశారు. మొదట ఆ నోట్ చూసిన సిబ్బంది నిజమైన నోటే అనుకున్నారు.
కానీ కాస్త పరిశీలిస్తే దాని మీద గాంధీ బొమ్మకు బదులు అంబేద్కర్ బొమ్మ ఉంది. దీంతో అది ఫేక్ నోట్ అని గుర్తించి షాకయ్యారు. ఎక్కడి నుంచో అంత దూరం అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు మంచిగా మొక్కుకోవాలి. కానీ ఇవేం పనులు అంటున్నారు అధికారులు. బెట్టింగ్ మానేయాలి అంటే భర్తను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. కానీ ఇలా చీటీ రాసి కానుకలు వేయాల్సిన హుండీలో వేస్తే కోర్కెలు ఎలా నెరవేరేతాయంటున్నారు ఇది చూసిన భక్తులు. వేసినమ్మ ఎవరో కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించింది అంటున్నారు.