MINISTER MALLAREDDY: పాపం మల్లారెడ్డి కాలేజీ లెక్చరర్లు.. డబ్బులు పంచుతూ దొరికిపోయారు..!

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 9వ డివిజన్‌లో మల్లారెడ్డి కళాశాలకు చెందిన సిబ్బంది, విద్యార్థులు.. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. ఈ విషయం గుర్తించిన కాంగ్రెస్ నేతలు వారిని పట్టుకున్నారు. దీంతో లెక్చరర్లు డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 28, 2023 | 04:57 PMLast Updated on: Nov 28, 2023 | 4:57 PM

Medchal Congress Leaders Nabbed Minister Mallareddy College Lecturers

MINISTER MALLAREDDY: తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో.. పార్టీలు డబ్బులు పంచి, ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం మొదలుపెట్టాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డి (బీఆర్ఎస్) తరఫున డబ్బులు పంచుతూ ఆయన కాలేజీకి చెందిన లెక్చరర్లు దొరికిపోయారు. ఈ ఘటన మంగళవారం మేడ్చల్ జిల్లా, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో జరిగింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 9వ డివిజన్‌లో మల్లారెడ్డి కళాశాలకు చెందిన సిబ్బంది, విద్యార్థులు.. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు.

Sonia Gandhi: దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మారుద్దాం.. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం..

ఈ విషయం గుర్తించిన కాంగ్రెస్ నేతలు వారిని పట్టుకున్నారు. దీంతో లెక్చరర్లు డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కయ్యారు. మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్ధి తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో డబ్బులు పంచుతున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. మేడ్చల్ నియోజకవర్గం, పీర్జాదిగూడ పరిధిలో విచ్చలవిడిగా బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారని, ఈ అంశంపై ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు ఎలక్షన్ అధికారులు పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఓటమి భయంతోనే మంత్రి మల్లారెడ్డి ప్రలోభాలకి తెరలేపారని, నిజoగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఈ ప్రలోభాలు ఎందుకు చేస్తున్నారని మల్లారెడ్డిని ప్రశ్నించాడు మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్ధి తోటకూర వజ్రేష్ యాదవ్. మేడ్చల్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించి, తనకు ఓటు వేసి, గెలిపించాలని కోరారు.