Journalist Shamaik Sarilla : నామినేషన్ రోజే మేడ్చల్ ఎమ్మెల్యే బరిలో ఉన్న దళిత వ్యక్తి, యువ జర్నలిస్ట్ షమైక్ సరిళ్ల కు ఘోర అవమానం!

తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛమైన ఎన్నికలు రావాలని.. యువతకు తనే ఒక మార్గాన్ని చూపించేందుకు తొలి అడుగు వెసిని సమైక్ కు కీసర ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేయడానికి వెళ్లారు. నామినేషన్ వేసేందుకు వెళ్లిన సమైకు అక్కడ ఘోర అవమానం జరిగింది. ఎన్నికల రూల్ ప్రకారం.. ఒక వ్యక్తి నామినేషన్ వేయడానికి అభ్యర్థితో పాటు నలుగురు వ్యక్తులు తన వెంట తీసుకెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చు అన్న నియమం దేశ వ్యాప్తంగా ఉంది. అయినప్పటికీ తనతో ఒక్కరిని కూడా లోపలికి అనుమతించలేదు.. పైగా నామినేషన్ వేసిన అభ్యర్థి ఎవరు కూడా ఒక్క ఫోటో కూడా దిగనివ్వలేదు అక్కడి అధికారులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 11, 2023 | 12:35 PMLast Updated on: Nov 11, 2023 | 12:44 PM

Medchal Mla Barilo Is A Dalit Man A Young Journalist Samaik Sarilla Was Humiliated On The Nomination Day

తెలంగాణ ఎన్నికలు గత వారం నుంచి చాలా జోష్ మీద ఉన్నాయి.. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా మొదలు పెట్టాయి. ఇక నిన్న ఉదయం నుంచి రాష్ట్ర మంతటా ఎక్కడ చూసిన నామినేషన్ వేసేందుకు నేతలు ర్యాలీలు చేపట్టారు. ఈ సారి ఎన్నికల బరిలో అక్కడక్కడ కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అందులో ఒకరు.. యువ జర్నలిస్ట్ ఈ సారి మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

ప్రస్తుతం మేడ్చల్ అన్న అక్కడి మంత్రి మల్లారెడ్డి అన్న రాష్ట్ర ప్రజలందరికీ అక్కర్లేని పరిచయం. మేడ్చల్ లో ఏం కనిపిస్తుంది అని అడగండం కన్నా ఏం వినిపిస్తుంది అని అడిగితే బాగుంటుంది. ఎందుకు అంటారా.. గత ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి కేసీఆర్ రెండో కేబినెట్ లో మంత్రిగా ఉన్న మల్లారెడ్డి డైలాగే తెగ ఫెమస్ అయ్యింది మరి. మంత్రి మల్లారెడ్డి నోటి నుంచి నేను ఈ అభివృద్ది చేసిన అన్న పదాం నోటి నుంచి వచ్చిదో లేదోగాని.. పాలమ్మినా.. పులమ్మినా.. స్కూల్స్ పెట్టినా.. కాలేజీలు నడిపిస్తున్న డైలాగే వస్తుంది. అంత ఫేమస్ అయ్యాడు మరి మల్లారెడ్డి. కోట్లు సంపాదించుకున్నా అలాంటి వ్యక్తి పై ఇప్పుడు ఓ యువ జర్నలిస్ట్ పోటీ చేస్తున్నారు స్వతంత్ర అభ్యర్థిగా.. ఆ అభ్యర్థి గెలుస్తారా.. ? గెలవడా..?. అని ప్రశ్న పక్కన పెడితే.. భారత పౌరుడిగా ఎన్నికల్లో పోటి చేసే హక్కుతో నామినేషన్ వేయడానికి వేలితే ఆ వ్యక్తికి ఎన్నికల అధికారుల ముందే ఘోర అవమానం జరగింది.

ఇంతకి ఎవరు ఆ జర్నలిస్ట్.. ఎన్నికల్లో పోటీకి కారణం ఇదే..

ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల బరిలో యువ జర్నలిస్ట్ సమైక్ సరిళ్ల అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. ” ప్రస్తుతం ఎన్నికలంటే కేవలం డబ్బులుంటేనే సరిపోతుందని భావరణ.. పరిస్థితులు దేశం మొత్తం మీద అందిరిలోను ఇలానే ఉన్నాయి. ఎన్నికలు వస్తే చాలా ప్రజా ప్రయోజనాలు మరిచి ఇంటింటికి వెళ్లి పెన్ను, పేపర్ పట్టి అమ్మ మీ సమస్య ఏంటి అనే ఒక్క నాయకుడు లేడు గానీ.. అమ్మ మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు.. ఓటుకు ఇంత అని ఇచ్చేవారు.. BB ( బీరు, బీర్యానీ) ఇచ్చ ప్రచారం చేయించుకునేవాళ్లు ఎక్కువ.. ధనవంతులు మాత్రమే రాజకీయాలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో స్వచ్ఛమైన రాజకీయాలకు తన నామినేషన్ తొలి అడుగుగా.. నాంది కావాలని ఆకాంక్షిస్తూ.. చదువుకున్న వారు, యువత ఎవ్వరికీ భయపడకుండా స్వతంత్రంగా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో మొట్ట మొదటిసారి తాను ఎన్నికల్లో పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నని సమైక్ తెలిపారు.

ఎన్నికల వేళ.. దళిత వ్యక్తికి అవమానం..

తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛమైన ఎన్నికలు రావాలని.. యువతకు తనే ఒక మార్గాన్ని చూపించేందుకు తొలి అడుగు వెసిని సమైక్ కు కీసర ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేయడానికి వెళ్లారు. నామినేషన్ వేసేందుకు వెళ్లిన సమైకు అక్కడ ఘోర అవమానం జరిగింది. ఎన్నికల రూల్ ప్రకారం.. ఒక వ్యక్తి నామినేషన్ వేయడానికి అభ్యర్థితో పాటు నలుగురు వ్యక్తులు తన వెంట తీసుకెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చు అన్న నియమం దేశ వ్యాప్తంగా ఉంది. అయినప్పటికీ తనతో ఒక్కరిని కూడా లోపలికి అనుమతించలేదు.. పైగా నామినేషన్ వేసిన అభ్యర్థి ఎవరు కూడా ఒక్క ఫోటో కూడా దిగనివ్వలేదు అక్కడి అధికారులు. కుటుంబంతో నామినేషన్ వేద్దామనుకొని ఎంతో సంతోషంగా కార్యాలయానికి వచ్చిన తనకి ఎన్నికల సిబ్బంది ద్వారా అవమానం జరగిందని తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. పెద్ద పెద్ద హుందాగా ప్రవర్తించే నాయకులు తమ మంది, మార్బలంతో, ఫోటోలు వీడియోలు, డ్రోన్ షార్ట్ తీసుకుంటే.. సాధారన జర్నలిస్టు ఓ పోటో తిసుకోవాడినికి అనుమతి ఇవ్వలేదు. అగ్ర నాయకులను ఒకలా.. దళిత వర్గానికి చెందిన తనను మరోలా చూశారని ఎన్నికల కార్యలయం ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. సమైక్ ఇదే పట్టుదలతో తనకు ఎదురైన అవమానాలను పునాది రాళ్లుగా మార్చుకుంటు ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. సమాజంలో స్వచ్ఛమైన రాజకీయాలు రావాలని.. డబ్బులతో చేసే రాజకీయాలు అంతం కావాలని అనే ఉద్దేశంతో సమైక్ తన నామినేషన ద్వారా నిరసన వ్యక్తం చేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు.

Medchal MLA Barilo is a Dalit man, a young journalist Samaik Sarilla was humiliated on the nomination day

ఈ సంఘటన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాజకీయ విశ్లేషకులు..

రాష్ట్రంలో ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థులను గెలుపు గుర్రాలుగా ఎన్నికల బరిలోకి దింపుతున్నారు. ప్రతి పార్టీలో కుల రాజకీయాలు జరుగుతున్నాయి. మేం అధికారంలోకి వస్తే బీసీ ని ముఖ్యమంత్రిని చేస్తా.. మేం అధికారంలోకి వస్తే ఓ దళిత నాయకుడినే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాం అంటూ ప్రగల్బాలు పలుకుతున్న రాజకీయ నాయకులు ఇప్పుడు ఏం అయిపోయారు. నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారే..ఓ మధ్య తరగతి వారిని సీఎం లు చేస్తా అన్నావాళ్లు ఓ దళిత వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయేబోతుంటే అతని పై ఇంతటి అక్కసు చూపిస్తారా..? నామినేషన్ వేసిన రోజే ఇంతటి అవమానానికి గురి చేస్తారా..? ఇప్పుడు ఏం అయ్యాయి ఆ నోర్లు అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు కామేట్స్ చేస్తున్నారు.

S.SURESH