MALLAREDDY: బీజేపీలోకి మల్లారెడ్డి..? ఈసారి ఖాయమేనా..?
ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఈటెల రాజేందర్ మధ్య జరిగిన సంభాషణ కొత్త చర్చకు దారి తీస్తోంది. మేడ్చల్‌లోని KSR కన్వెన్షన్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు మల్లారెడ్డి హాజరయ్యారు. అదే కార్యక్రమానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా వచ్చారు.
MALLAREDDY: తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత నాయకులంతా ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరగా మరికొందరు కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఈటెల రాజేందర్ మధ్య జరిగిన సంభాషణ కొత్త చర్చకు దారి తీస్తోంది.
NARA LOKESH: టార్గెట్ లోకేష్.. మంగళగిరిలో ఎన్ని నామినేషన్లు పడ్డాయంటే..
మేడ్చల్‌లోని KSR కన్వెన్షన్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు మల్లారెడ్డి హాజరయ్యారు. అదే కార్యక్రమానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా వచ్చారు. ఈటెలను చూసిన వెంటనే మల్లారెడ్డి ఆయన దగ్గరకు వెళ్లారు. కౌగిలించుకుని ఆప్యాయంగా మాట్లాడారు. మల్కాజ్‌గిరిలో నువ్వే గెలవబోతున్నావ్ అన్నా అంటూ రాజేందర్‌ను హత్తుకున్నారు. తాము పాత మిత్రులమని.. ఎప్పటికైనా మళ్లీ కలుసుకుంటామని మల్లారెడ్డి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ నేత గెలవబోతున్నాడు అని మల్లారెడ్డి చెప్పడంతో.. త్వరలోనే ఆయన బీజేపీలోకి వెళ్లబోతున్నారు అనే టాక్ మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మల్లారెడ్డి మీద వరుసగా ఐటీ, మున్సిపల్ దాడులు జరిగాయి. మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించిన ఓ బిల్డింగ్‌ను కూడా అధికారులు కూల్చేశారు.
ఈ ఒత్తిడితో మల్కాజ్‌గిరి పోటీ నుంచి కూడా మల్లారెడ్డి తప్పుకున్నారు. అప్పటి నుంచి బీఆర్‌ఎస్‌లో కూడా సైలెంట్‌గా ఉంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈటెలతో మల్లారెడ్డి ఇలా మాట్లాడటం అందరిలో ఆసక్తిని రేపింది. ఇప్పటికే పార్టీ వీడిన చాలా మంది లాగే మల్లారెడ్డి కూడా త్వరలో కాషాయ కండువా కప్పుకుంటారా అనే టాక్ మొదలైంది.