Media Ranking: పాపం TV9.. మురిపం మూన్నాళ్లే.. రేటింగ్ ఎందుకు పడిపోయిందో తెలుసా..
మోసం చేసి ఎవరూ ఫస్ట్ రాలేరు నిజమే. కానీ ఫస్ట్ ప్లేస్ అనేది ఎవరికీ శాశ్వతం కాదు. ఫస్ట్ ప్లేస్ ఎప్పటికీ మనకే రిజర్వ్ అనుకుంటే దానికంటే అమాయకత్వం మరొకటి ఉండదు.
ఈ విషయంల టీవీ9 తెలుసుకుని ఉంటే బాగుండేది. కుట్ర నాట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ వన్. హైదరబాద్ సిటీలో వారం రోజుల నుంచి కనిపిస్తున్న పోస్టర్లు, ఫ్లెక్సీలు ఇవి. ఈ ఫ్లెక్సీల వెనక ఉన్న అసలు మ్యాటర్ ఎంటీ అంటే రెండు వారాల నుంచి బార్క్ ఇచ్చే టీఆర్‌పీ రేటింగ్‌లో టీవీ9 ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అంతే తాము ఫస్ట్ వచ్చామన్న సంతోషం కంటే తమ ప్రత్యర్థి ఎన్ టీవీ ఫస్ట్ ప్లేస్ కోల్పోయిందనే సంతోషమే వాళ్లలో ఎక్కవుగా కనిపించింది. జరనల్‌గా ఎవరికైనా ఫస్ట్ ప్లేస్ వస్తే మేము నెంబర్ వన్ అని చెప్పుకోవాలి. కానీ టీవీ9 మాత్రం మోసం నాట్ ఈజ్ ఈక్వల్ నెంబర్ అంటూ ఫ్లెక్సీలు వేయించింది. అంటే ఇండరెక్ట్‌గా ఎన్ టీవీ మోసం చేసి నెంబర్ వన్‌లో కొనసాగుతోంది అనే టీవీ9 పాయింట్.
అయితే వాళ్లు కొట్టుకున్న డబ్బు సౌండ్ ఎక్కువకాలం రాలేదు. వారం రోజులు తిరగేసరికి మళ్లీ ఐదో ప్లేస్‌కు పడిపోయింది టీవీ9. ఎప్పటిలాగే ఎన్ టీవీ నెంబర్ వన్ ప్లేస్‌కు వచ్చేసింది. సిటీలో వారం రోజుల పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది టీవీ9 ఆ డబ్బేదో కష్టపడ్డ ఉద్యోగులకు ఇస్తే వాళ్లు ఇంకా ఎనర్జీతో పనిచేసేవాళ్లు. లాస్ట్ వీక్ వచ్చిన నెంబర్ వన్ ప్లేస్ అలాగే కంటిన్యూ అయ్యే చాన్స్ ఉండేది. కానీ ఆ పని చేయకుండా పక్క చానల్‌ను టార్గెట్ చేస్తూ తన ఇమేజ్‌ను తానే డ్యామేజ్ చేసుకుంది టీవీ9. జస్ట్ వారంలో రోజుల్లో రేటింగ్స్ మారిపోతాయని తెలిసినా ఇన్ని కోట్లు ఖర్చు చేసి పబ్లిసిటీ చేయడం విమర్శలు వస్తున్నాయి. అధికారం మొదటి స్థానం ఎప్పుడూ ఎవరికీ శాశ్వతం కాదంటున్నారు ఈ ఫ్లెక్సీలు చూసినవాళ్లు.