Global Star, Mega Daughter : మహాలక్ష్మి ఆలయంలో మెగా డాటర్ పూజలు..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవల ఓ పాప పుట్టిన విషయం తెలిసిందే. ఆమెకు క్లిన్ కారా అనే పేరు పెట్టారు. దీంతో రామ్ చరణ్ కొద్ది కాలం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి తన కూతుర్ని చూసుకున్నాడు. ఇప్పటివరకు ఆ పాప ఫొటో బయటకు రాకుండా ఉపాసన, చరణ్ జాగ్రత్త పడ్డారు. అయితే ఇటీవల రామ్ చరణ్ దంపతులు కూతురిని తీసుకుని ముంబైకి వెళ్లారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది.

Mega daughter pujas in Mahalakshmi temple
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవల ఓ పాప పుట్టిన విషయం తెలిసిందే. ఆమెకు క్లిన్ కారా అనే పేరు పెట్టారు. దీంతో రామ్ చరణ్ కొద్ది కాలం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి తన కూతుర్ని చూసుకున్నాడు. ఇప్పటివరకు ఆ పాప ఫొటో బయటకు రాకుండా ఉపాసన, చరణ్ జాగ్రత్త పడ్డారు. అయితే ఇటీవల రామ్ చరణ్ దంపతులు కూతురిని తీసుకుని ముంబైకి వెళ్లారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. జూన్ 20న క్లీన్ కారా పుట్టింది. తాజాగా క్లిన్ కారాకు ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంగా చరణ్ దంపతులు తమ పాప క్లిన్ కారాతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ తర్వాత కిందకు దిగి వస్తుండగా మీడియా కంట పడ్డారు. కానీ పాప ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు, ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో పాటు, బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ కోసం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కూడా బిజీగా ఉన్నాడు.