Olympics Mega family : పారిస్ లో లైఫ్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న మెగా ఫ్యామిలీ…!
మన టాలీవుడ్ (Tollywood) హీరోలు వరల్డ్ టూర్ (World Tour) లకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

Mega family enjoying life in Paris...
మన టాలీవుడ్ (Tollywood) హీరోలు వరల్డ్ టూర్ (World Tour) లకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా యూరప్ టూర్ (Europe Tour) లకు వెళ్ళడానికి స్టార్ హీరోలు ఈ సమయంలో రెడీ అయిపోతారు. యూరప్ లో ఈ సమయం వేసవి కాబట్టి అక్కడ కనువిందు చేసే ప్రకృతి అందాలను ఆశ్వాదించడానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తూ ఉంటారు. తమ సినిమాలకు కాస్త గ్యాప్ దొరికింది అంటే చాలు వాళ్ళు వరల్డ్ టూర్ కి రెడీ అయిపోతున్నారు. వృత్తికి గ్యాప్ దొరకడంతో వ్యాపారానికి కూడా గ్యాప్ ఇచ్చేసి చెక్కేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ ఫ్యామిలీ (Megastar family) మొత్తం యూరప్ లోనే ఉంది. పారిస్ లో జరుగుతున్న ఒలంపిక్స్ కు హాజరు అయ్యారు.
ఒలంపిక్స్ ప్రారంభ వేడుకల్లో… మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), ఆయన సతీమణి సురేఖ (Surekha), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), ఆయన సతీమణి ఉపాసన, వీరి తనయ క్లిన్ కారా పారిస్ (Clin Kara) వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. తాజాగా ఈఫిల్ టవర్ (Eiffel Tower) ముందు సెన్ నది ఒడ్డున ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ వద్ద మెగా ఫ్యామిలి సేద తీరుతూ ఉండగా ఆ వీడియో ని ఉపాసనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అలాగే పారిస్ వీధుల్లో చిరంజీవి, సురేఖ నడిచే సన్నివేశాలు కూడా వీడియోలో పొందుపరిచారు. మరో వారం పాటు వీళ్ళు అక్కడే ఉండే అవకాశం ఉంది అని సినీ వర్గాలు అంటున్నాయి. జర్మనీ, స్పెయిన్ కూడా వెళ్లి రానున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నటించే గేమ్ చేంజర్ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉందని నిర్మాత దిల్ రాజు సంకేతాలు ఇచ్చారు. ఈ సినిమాకు తమిళ స్టార్ దర్శకుడు శంకర్… దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని ఈ మెగా హీరో పట్టుదలగా ఉన్నాడు.