Varun And Lavanya: మెగా ఇంట పెళ్లి భాజ షురూ
మెగా ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. కొణిదెల వారింటికి కొత్త కోడలు వచ్చేస్తోంది. డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్న వరుణ తేజ్ దంపతులు.. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. అంగరంగ వైభవంగా ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు

Mega Prince Varun Tej and Lavanya Tripathi are getting ready for the wedding ceremony
మెగా వారింట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. మెగా ప్రిన్స్ , నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ వివాహానికి ముందుగానే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టిన మెగా ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. మెగా కాపౌండ్ హీరోలతో పాటు, మెగా వారసులంతా నాగబాబు ఇంటికి చేరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా… ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఈవెంట్‌కు చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు, రామ్ చరణ్ & ఉపాసన, నాగబాబు ఫ్యామీలి, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, అలాగే మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా పాల్గొన్న ఫోటోలు వైరల్ గా మారాయి.
టాలీవుడ్ లవ్‌బర్డ్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠీలు త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. జూన్‌లో అంగరంగ వైభవంగా ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనుల ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయిందని తెలుస్తోంది. నవంబర్ 1న డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఇటలీలోని ఓ ప్యాలెస్‌లో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారట. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే లవ్ బర్డ్స్ పెళ్లి షాపింగ్ తో బిజీగా మారినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్ళికొడుకు కాబోతుండటంతో మెగా అభిమానులు సంబరపడుతున్నారు. కాబోయే జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. జంట అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.