Mega Family: వరుణ్ – లావణ్య పెళ్లికి సర్వం సిద్దం.. నేడు ఇటలీ వెళ్లనున్న మెగా – అల్లూ ఫ్యామిలీ
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు ఇంట పెళ్లి సందడి మొదలైంది. వరుణ్ -లావణ్యల వివాహానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు. ఇటలీ నుంచి మాదాపూర్ లో నిర్వహించే రిసెప్షెన్ వరకూ అన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

Megastar, Allu Aravind family members to go to Italy for Varun Tej and Lavanya Tripathi's wedding
మెగా ఇంట పెళ్లి భాజా మోగనుంది. గతంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం సింపుల్ గా చేసినప్పటికీ పెళ్లి ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఇటలీని వివాహ వేదికగా ఎంచుకున్నారు. నవంబర్ 1న ఈ జంట అగ్నిసాక్షిగా ఏడు అడుగులు వేయనున్నారు. తమ్ముడి పెళ్లికి అందరికంటే ముందుగా రామ్ చరణ్ ఉపాసనాలు ఇటలీ వెళ్లి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తరువాత వరుణ్ తేజ్ – లావణ్య లు ఇటలీ చేరుకుని పనులను పరిశీలించారు. తాజాగా అల్లూ అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి ఇటలీ చేరుకున్నారు. రామ్ చరణ్, ఉపాసనలతో పాటూ బన్నీ ఫ్యామిలీ కూడా పెళ్లి పనుల్లో ఒక చెయ్యి వేశారు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవితో పాటూ అల్లూ అరవింద్ కుటుంబ సభ్యుల అందరూ కలిసి ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ప్రీ వెడ్డింగ్ షూట్లో భాగంగా అక్టోబర్ 30న కాక్‌టేల్ పార్టీ మొదలు కానుంది. ఆతరువాత 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నట్లు సమాచారం. నవంబర్ 1న పెళ్లి కుటుంబ సభ్యులతో ఇటలీలో నిర్వహించుకుని హైదరాబాద్ తిరిగి రానున్నారు. హైదరాబాద్లో మాధాపూర్ ఎన్ కన్వెన్షన్ లో నవంబర్ 5న రిసెప్షన్ నిర్వహించనున్నారు. సినీరాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మెగా కుటుంబంలోని పెద్ద హాజరు కాలేకపోవడం కుటుంబ సభ్యుల్లో నిరుత్సాహానికి గురిచేస్తోంది. మెగా ఫ్యామిలీలో ముఖ్యమైన వ్యక్తి చిరంజీవి తల్లి అంజనాదేవి. ఈమె తన మనవడి పెళ్లికి హాజరు కాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆమె ఆరోగ్యం రిత్యా దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదని వైద్యులు సూచించారు. దీంతో ఆమె హైదరాబాద్ లోనే ఉండనున్నారు. అయితే వరుణ్, లావణ్యల వివాహాన్ని పెద్ద టీవీలో లైవ్ చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు చిరంజీవి.
ప్రస్తుతం వరుణ్ – లావణ్యల వివాహానికి సంబంధించిన పెళ్లి కార్డు ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మరింది. హ్యష్ ట్యాగ్ వరుణ్ పేరుతో ఎక్స్ ట్విట్టర్ లోకూడా ట్రెండింగ్లోనడుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తన వ్యక్తిగత ఖాతాలో పోస్ట్ చేశారు హీరో వరుణ్ తేజ్. ఇది చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు.
T.V.SRIKAR