MEGASTAR CHIRANJEEVI: ఏపీ ఎన్నికల్లో కూటమికే చిరంజీవి మద్దతు.. వారికోసం స్పందించిన చిరు
ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ పెట్టినప్పటికీ ఎప్పుడూ బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. కానీ, పరోక్షంగా పవన్‌కు సాయం అందిస్తున్నారు. ఇటీవలే జనసేనకు రూ.5 కోట్ల విరాళం అందించారు చిరు.
MEGASTAR CHIRANJEEVI: గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి, ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, అనంతరం కేంద్ర మంత్రిగానూ సేవలందించారు మెగాస్టార్ చిరంజీవి. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ పెట్టినప్పటికీ ఎప్పుడూ బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. కానీ, పరోక్షంగా పవన్‌కు సాయం అందిస్తున్నారు.
TDP NOMINATIONS: 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు.. బీఫామ్‌లు అందజేసిన చంద్రబాబు
ఇటీవలే జనసేనకు రూ.5 కోట్ల విరాళం అందించారు చిరు. దీంతో పవన్‌కు చిరు తన మద్దతును ఆర్థిక సాయం రూపంలో చెప్పారని అభిమానులు అంటున్నారు. అయితే, తాజా ఎన్నికల్లో ఏపీలో చిరు ఎవరికి మద్దతు ఇస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది. ఆయన మద్దతు ఉంటే.. అభిమానుల ఓట్లు కొంతవరకు ఆయా పార్టీలకు పడే ఛాన్స్ ఉంది. అందుకే చిరు కోసం పార్టీలు, నేతలు ప్రయత్నిస్తుంటారు. ఏపీలో ఎన్నికల సందర్భంగా చిరు పేరు చర్చకు వస్తూనే ఉంటుంది. కానీ, ఆయన ఎప్పుడూ, ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. ఈసారి పరోక్షంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చిరు మద్దతు ప్రకటించారు. అలాగని పూర్తిగా ఆ కూటమికే ఓటు వేయాలని చిరు చెప్పలేదు. కానీ, కూటమి అభ్యర్థులైన సీఎం రమేశ్, పంచకర్ల రమేష్ బాబుకు తన మద్దతు ఉంటుందన్నారు. వారిద్దరికీ రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని చిరంజీవి కోరారు.
సీఎం రమేష్ అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కూటమిలోని బీజేపీ, జనసేన అభ్యర్థులకు ఓటు వేయాలని చిరు చెప్పడం ద్వారా ఆ కూటమికి మెగాస్టార్ మద్దతు ఇచ్చినట్లైంది. అయితే, చిరు వారిద్దరితో గతంలో ఉన్న పరిచయం వల్లే వారికి సపోర్ట్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి మద్దతు కూటమికే అని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు.