MEGASTAR CHIRANJEEVI: ఏపీ ప్రచారంలో మెగాస్టార్.. ఇక మామూలుగా ఉండదు..
త్వరలో చిరంజీవి పిఠాపురంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున క్యాంపెయిన్ చేయబోతున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి పెద్దగా రాజకీయాల జోలికి పోలేదు. తమ్ముడు పవన్ కల్యాణ్ గత పదేళ్లుగా జనసేన పార్టీ పెట్టి ఎన్నికల్లో ఒంటరిగా కష్టపడుతున్నాడు.

Padma Shri.. Padmavibhushan OK? Where is Chiranjeevi actor?
MEGASTAR CHIRANJEEVI: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎన్డీఏ కూటమి తరపున ఆయన ప్రచారానికి రెడీ అవుతున్నారు. త్వరలో చిరంజీవి పిఠాపురంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున క్యాంపెయిన్ చేయబోతున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి పెద్దగా రాజకీయాల జోలికి పోలేదు. తమ్ముడు పవన్ కల్యాణ్ గత పదేళ్లుగా జనసేన పార్టీ పెట్టి ఎన్నికల్లో ఒంటరిగా కష్టపడుతున్నాడు.
MEGASTAR CHIRANJEEVI: ఏపీ ఎన్నికల్లో కూటమికే చిరంజీవి మద్దతు.. వారికోసం స్పందించిన చిరు
మెగా ఫ్యామిలీ నుంచి నటుడు నాగబాబు ప్రత్యక్షంగా సపోర్ట్ ఇస్తున్నారు. పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. కానీ మెగాస్టార్ మాత్రం ఇప్పటి దాకా డైరెక్టుగా జనసేనకు సపోర్ట్ ప్రకటించలేదు. చిరంజీవి ఇంకా కాంగ్రెస్‌కు రాజీనామా చేయలేదనీ.. ఆయన మా వాడే అంటూ కొందరు ఏపీ కాంగ్రెస్ లీడర్లు కామెంట్ కూడా చేస్తున్నారు. ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా చేయడానికి టీడీపీ, జనసేన, బీజేపీ జత కట్టాయి. పవన్ కల్యాణ్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంతో తమ్ముడి కోసం డైరెక్టుగా క్యాంపెయిన్ చేయాలని మెగాస్టార్ చిరంజీవి డిసైడ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేనకు ఈమధ్యే 5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు చిరంజీవి. రెండు రోజుల క్రితం కూటమి అభ్యర్థులు.. పంచకర్ల రమేష్, సీఎం రమేష్ కు ఓటేయాలంటూ.. ఓ ప్రచార వీడియో విడుదల చేశారు మెగాస్టార్.
వాళ్లిద్దరే కాదు.. రాష్ట్రంలో మిగిలిన చోట్ల కూడా కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలని నిర్ణయించారు. చిరంజీవితో ప్రచారం చేయించాలని టీడీపీ కూడా ఒత్తిడి చేస్తోంది. దాంతో మెగాస్టార్ రేపో, మాపో షెడ్యూల్ ఖరారు చేసుకొని.. కూటమి తరపున ప్రచారం ప్రారంభించనున్నారు. మొదట తమ్ముడు పవన్ కల్యాణ్ తరపున పిఠాపురం నుంచే తన క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పుడు పవన్ సభల్లో చిరంజీవి పేరు చెబితే కేకలు పెడుతున్న అభిమానులు.. స్వయంగా మెగాస్టార్ రంగంలోకి దిగితే ఆ జోష్ మామూలుగా ఉండదని కూటమి అభ్యర్థులు హ్యాపీగా ఉన్నారు.