మెగావేలం సూపర్ సక్సెస్, మల్లికా సాగర్ పై ప్రశంసలు

రెండ్రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఐపీఎల్ మెగావేలం పూర్తయింది. ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసే బిజీలో ఉంటే క్రికెట్ అభిమానులు మాత్రం వేలంలో పాల్గొన్న అందమైన అమ్మాయిలను చూస్తూ ఉండిపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 27, 2024 | 08:30 PMLast Updated on: Nov 27, 2024 | 8:30 PM

Megavelam Is A Super Success Praises Poured On Mallika Sagar

రెండ్రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఐపీఎల్ మెగావేలం పూర్తయింది. ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసే బిజీలో ఉంటే క్రికెట్ అభిమానులు మాత్రం వేలంలో పాల్గొన్న అందమైన అమ్మాయిలను చూస్తూ ఉండిపోయారు. ప్రీతిజింతా, కావ్య మారన్ తమ అందాలతో కుర్రాళ్లను తెగ ఆకట్టుకున్నారు. మెగావేలం నిర్వాహకురాలు మల్లికా సాగర్ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె ఒక ఆర్ట్ కలెక్టర్.

మల్లికా కెరీర్‌ జర్నీ లండన్‌లోని సోథెబైస్‌లో ప్రారంభమైంది. 26 సంవత్సరాల వయస్సులో న్యూయార్క్ నగరంలోని క్రిస్టీస్‌లో మొదటి ఇండియన్ ఆక్షనర్‌గా కెరీర్ ప్రారంభించింది. ముంబైలో ఎన్నో వేలం కార్యక్రమాలను నిర్వహించింది. 2021లో ప్రో కబడ్డీ లీగ్ వేలం ద్వారా ఆమె అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 2023 ఫిబ్రవరిలో నిర్వహించిన మహిళా ప్రీమియం లీగ్ వేలం కూడా ఆమె నిర్వహించింది. ఐపీఎల్‌కు మొదటి ఉమెన్ ఆక్షనర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కెరీర్‌లో ఒక ముఖ్య ఘట్టం ఐపీఎల్ 2024 అని చెప్పుకోవచ్చు. క్రికెట్ వేలంలో అత్యంత అనుభవజ్ఞులైన హ్యూ ఎడ్మీడ్స్ స్థానంలో మల్లికా తొలి మహిళా నిర్వాహకురాలిగా చరిత్ర సృష్టించారు. దాంతో వెంట్‌లను కూల్‌గా, పర్ఫెక్ట్‌గా నిర్వహిస్తూ బెస్ట్ ఆక్షనర్‌గా పేరు తెచ్చుకుంది.

తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో మల్లిక ఎంత జీతం తీసుకుందనే గురించి నెటిజన్లు తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఎక్కడా ఈ విషయంపై ఎలాంటి అప్‌డేట్ లేదు. 2 రోజుల పాటు జరిగిన వేలంలో 182 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా, 10 జట్లు కలిసి 639.15 కోట్లు వెచ్చించాయి. రిషబ్ పంత్‌పై అత్యధిక బిడ్ దాఖలైంది. 27 కోట్లకు అమ్ముడుపోయి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అదే సమయంలో డేవిడ్ వార్నర్, శార్దూల్ ఠాకూర్, పీయూష్ చావ్లా వంటి ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. సమాచారం ప్రకారం రాబోయే ఐపిఎల్ సీజన్ మార్చి 17 నుండి ప్రారంభం కావచ్చు.