What’s App: ఒకే వాట్సప్ యాప్ లో రెండు వేర్వేరు అకౌంట్లు.. సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చిన మెటా

ప్రముఖ చాటింగ్ సోషల్ మీడియా యాప్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఒకే ఫోన్లో, ఒకే యాప్ ద్వారా రెండు అకౌంట్లను ఉపయోగించుకునే వెసులుబాటును తాజాగా తీసుకొచ్చింది మెటా సంస్థ. దీనిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 21, 2023 | 02:34 PMLast Updated on: Oct 21, 2023 | 2:34 PM

Meta Company Has Made Available A New Feature To Use Two Accounts Through The Same Whatsapp App

ప్రస్తుత యుగం సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తూ ఉంటారు. ఇక వాట్సప్, టెలిగ్రాం వంటి యాప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనివసరం లేదు. ఇవి చాటింగ్ తో పాటూ, వీడియోస్, ఇమేజెస్, ఆడియో ఫైల్స్, డాక్యూమెంట్స్ అన్నింటినీ చిటికెలో అవతలి వ్యక్తులకు పంపించవచ్చు. దీంతో పాటూ వీడియో కాల్, ఆడియో కాల్ సౌకర్యము కూడా ఉంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది దీనిని వినియోగించుకుంటున్నారు. అయితే ఈ వాట్సప్ యాప్ తాజాగా ఒకే ఫోన్లో ఒకే యాప్ ద్వారా రెండు అకౌంట్లను ఉపయోగించుకునేలా తయారు చేసింది.

మనం సాధారణంగా వాట్స్ లో రెండు నంబర్లను ఉపయోగించుకుంటూ ఉంటాము. ఒకటి వ్యక్తిగత సంభాషణలు చేసుకోవడానికి, మరొకటి ఆఫీస్, బిజినెస్ కార్యకలాపాలకు వాడుతూ ఉంటాం. దీనికోసం క్లోన్ యాప్ లను ఉపయోగించాల్సి ఉంటుంది. వాటికి నోటిఫికేషన్స్ వచ్చినా వినిపించవు, కనిపించవు. దీంతో ఎవరు చాట్ చేశారో చూసుకోవాలంటే సెకెండ్ వాట్సప్ యాప్ ను తప్పనిసరిగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అలా అవసరం లేకుండా ఒకే యాప్ లో రెండు వాట్సప్ అకౌంట్లను వినియోగించుకునేలా యూజర్స్ కి అందుబాటులో తెచ్చింది ఈ సంస్థ. ఈవిషయాన్ని తాజాగా తన బ్లాగ్ వేదికగా మెటా సీఈవో జూకర్ బర్గ్ వెల్లడించారు.

ఈ వాట్సప్ ఫీచర్ ను మెటా సంస్థ అధికారికంగా తీసుకొచ్చిన నేపథ్యంలో ఒకే ఫోన్లో, ఒకే యాప్ ద్వారా రెండు వాట్సప్ అకౌంట్లను ఉపయోగించుకోవచ్చు. దీనికి డ్యూయల్ సిమ్ ఫోన్ ఖచ్చితంగా ఉండాలి. అందులో రెండు సిమ్ కార్డులు తప్పని సరిగా పొందుపరచాలి. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ క్లోన్ , ఫేక్ యాప్ లను అన్ ఇన్ స్టాల్ చేసి అఫీషియల్ వాట్సప్ ను ఉపయోగించుకుంటారు. ఈ సరికొత్త ఫీచర్ కి సంబంధించి గత జూన్ నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అప్పట్లో ప్రయోగాత్మక దశలో ఉన్నందున ఇప్పుడు కొందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో అన్ని వర్షన్ల స్మార్ట్ ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు సంస్థ ప్రతినిథులు.

ఎలా క్రియేట్ చేయాలి..

  • వాట్సప్ తెరవంగానే మనకు కుడివైపు పై భాగంలో మూడు చుక్కలు కనిపిస్తాయి.
  • ఈ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకున్న తరువాత సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి.
  • సెట్టింగ్స్ లో అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోగానే యాడ్ అకౌంట్ పై మరో సారి టచ్ చేయాల్సి ఉంటుంది.
  • ఇలా టచ్ చేసిన వెంటనే ఇన్ స్ట్రక్షన్స్ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
  • అప్పుడు రెండో వాట్సప్ అకౌంట్ అందుబాటులోకి వస్తుంది.
  • దీనిని అవసరమైనప్పుడు మూడు చుక్కలపై టచ్ చేసి రెండు అకౌంట్ల మధ్య స్విచ్ కావచ్చు.

T.V.SRIKAR