Instagram: ఎలక్షన్లో నాయకులకే కాదు.. ఇన్‌స్టా యూజర్స్ కి కూడా పోలింగ్ ఫీచర్ రానుంది
ఇన్‌స్టా యూజర్స్ కి గుడ్ న్యూస్. మెటా ఆధ్వర్యంలో నడిచే ఈ సోషల్ మీడియా యాప్ లో పోలింగ్ పేరుతో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్ ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

Meta company is going to make available a new feature called polling in the Instagram social media app
నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక అందులో ఏ యాప్ లేకున్నా పరవాలేదు కానీ ఇన్ స్టా మాత్రం తప్పనిసరి. ఇందులో తమకు నచ్చిన డ్రస్ వేసుకున్న ఫోటోలు మొదలు ఫేవరెట్ ఫుడ్, ప్రదేశాలలో దిగిన ఫోటోలు, వీడియోలు అన్నింటినీ చిత్రీకరించి పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఏ నడుస్తోంది అంటే మెటా సంస్థకు చెందిన యాప్స్ ట్రెండ్ నడుస్తోంది అని ఇక్కడ ఒక డైలాగ్ చెప్పుకోవాలి. దీనికి కారణం రోజుకు ఒక సరికొత్త ఫీచర్లతో మెటా గ్రూప్ తన సామాజిక మాధ్యమా యాప్ లను అప్డేట్ చేస్తోంది.
నిన్న మన్నటి వరకూ వాట్సప్ పై దృష్టి కేంద్రీకరించిన మెటా తాజాగా ఇన్ స్టా పై తన చూపును మళ్లించింది. అందులో భాగంగానే కామెంట్ సెక్షన్లో పోల్స్ పెట్టేలా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా మాధ్యమం ట్రెండింగ్లో నడుస్తోంది. ఇందులో పోస్ట్ చేసిన వాటికి కామెంట్స్ పెట్టడం పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది. ఈ ట్రెండ్ నుంచే పోల్స్ అనే ఫీచర్ ను తీసుకువచ్చేందుకు పరిశోధనలు చేయనున్నట్లు తెలిపారు.
ఈ ఫీచర్ ద్వారా తమ పోస్ట్ లకు ఎంతమంది కామెంట్స్ పెట్టారో చూసుకుంటూనే.. ఆ కామెంట్ కి ఎంత మంది పాజిటివ్, నెగెటివ్ గా పోల్ చేశారో కూడా చూసుకోవచ్చు. ఇలా పోల్ అయిన డేటా ఎంతకాలం పాటూ కనిపిస్తుంది అనే విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు మెటా సంస్థ. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉన్నందున అన్ని రకాలుగా పరిశోధనలు జరిపి యూజర్స్ కి అందుబాటులోకి తీసుకురానుంది.
T.V.SRIKAR