Weather update : నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఇవాళ, రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.

Meteorological Department has given a chilling message to the people of Telangana state that rains will occur in these districts today and tomorrow
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఇవాళ, రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. మరికొన్ని జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతంలో కేంద్రీకృతమైన ఆవర్తనంతో పాటు రాయలసీమ అలాగే తెలంగాణ ప్రాంతాలలో ఏర్పడిన ఆవర్తనం…. కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడతాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో మరో వారం రోజులపాటు చల్లటి వాతావరణంతో పాటు వర్షాలు పడతాయని తెలిపింది.