Mexico’s Alien: నేటికీ సజీవంగా ఉన్న ఏలియన్లు.. గర్భం దాల్చినట్లు గుర్తించిన మెక్సికన్ పరిశోధకులు
గ్రహాంతర వాసులు గర్భం దాల్చినట్లు తాజాగా మెక్సికన్ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగంలో వెలుగులోకి వచ్చింది. వీటి కడుపులో పెద్ద పెద్ద గుడ్ల ఆకారంలో నమూనాలు ఉన్నట్లు గుర్తించారు.
గ్రహాంతర వాసులు కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించేవారని విన్నాం. దీనికి సంబంధించిన రుజువులు కొన్ని అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తూ ఉంటాయి. తాజాగా మెక్సికన్ వైద్యులు రెండు గ్రహాంతర శవాలపై విస్తృతమైన ప్రయోగాలు చేశారు. సోమవారం నూర్ క్లినిక్‌లో నౌకాదళానికి చెందిన ఫోరెన్సిక్ నిపుణులు జోస్ డి జీసస్ జల్సే బెనిటెజ్ ఈ పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని పార్లమెంట్ లోకి తీసుకొచ్చి ఆధారాలతో చూపించారు. వీటి శరీరభాగాలు, తల, మొండెం ఎవరూ తారుమారు చేయలేదని వాటి అవశేషాలు అలాగే ఉన్నాయని పేర్కొన్నారు.
తల, ప్రతి చేతికి మూడు వేళ్లు గుర్తింపు..
ఆ మృతదేహాలు ఒకే అస్థిపంజరానికి చెందినవని వైద్యులు తెలిపారు. జైమ్ మౌసన్, మెక్సికన్ జర్నలిస్ట్, సీనియర్ UFO ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గ్రహాంతర వాసుల తలతో పాటూ ప్రతి చేతికి మూడు వేళ్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఒకదాని కడుపులో గడ్డలు ఉన్నట్లు హై టెక్నాలజీ ఎక్స్ రేలతో పాటూ సిటీ స్కాన్ పరీక్షలు చేసి కనుగొన్నారు. నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలో పరిశోధకులు నిర్వహించిన కార్బన్ పరీక్ష ప్రకారం ఈ నమూనాలు సుమారు 1,000 సంవత్సరాల నాటివి అని తేలింది. భూమిపై ఉన్న ఏ జాతితోనూ ఇవి సంబంధం కలిగి లేదని పేర్కొన్నారు.
గర్భందాల్చినట్లు పరిశోధన..
మిస్టర్ బెనిటెజ్ తో పాటూ అతని బృందం అనేక రకాల పరిశోధలు చేశారు. రెండింటిలో ఒక అస్తిపంజరం ఇప్పటికీ సజీవంగా చెక్కుచెదరకుండా ఉందని తెలిపారు. దాని పొత్తికడుపులో జీవసంబంధమైన గడ్డలు ఉన్నట్లు వెల్లడించారు. బహుశా అది గర్భధారణలో ఉందన్న వాదనలకు సాక్షాలుగా స్కానింగ్ రిపోర్ట్ లను చూపించారు. వాటిలో పెద్ద పెద్ద గడ్డలు కనిపించాయి. దీంతో అక్కడి సభ్యులందరూ ముందుగా భయానికి గురైనప్పటికీ తీవ్ర ఆసక్తితో ఉత్కంఠగా చూసేందుకు ప్రయత్నించారు.
పెరూలో వెలికితీత..
ఈ సందర్భంగా జైమ్ మౌసాన్ మాట్లాడుతూ.. 2017లో పెరూలో పురాతన నాజ్కా లైన్స్ సమీపంలో గ్రహాంతరవాసుల శవాలు వెలికి తీశామని చెప్పారు. ఈ నమూనాలు మన భూగోళ పరిణామంలో భాగం కాదన్నారు. ఈ శరీరాలకు మనుషులతో ఎలాంటి సంబంధం లేదని ధృవీకరించవచ్చని పేర్కొన్నారు. ఈవెంట్ కి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయి ప్రజలను ఆశ్చర్యపరిచాయి. ఔత్సాహికులలో భయం, ఉత్సాహంతో పాటూ ఉత్సుకతను రేకెత్తించాయి.
Mexico’s Congress just unveiled two dead aliens estimated to be around 1,000 years old. What do you think? pic.twitter.com/Zr7z4FKenS
— Kage Spatz (@KageSpatz) September 13, 2023
T.V.SRIKAR