Microsoft: బిల్ గేట్స్ విడాకుల ప్రయాణంలో మరో ప్రేమాయణం నిజమేనా..?
బిల్ గేట్స్ మిలిందా కలయిక:
బిల్ గేట్స్ ఈ పేరు చెబితే టక్కున గుర్తుకొచ్చే పేరు మైక్రోసాప్ట్ అధినేత, ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరు. మైక్రోసాప్ట్ ను 1987లో స్థాపించి బిల్ గేట్స్ సీఈఓగా ఉన్న సమయంలో మిలిందా ప్రోడక్ట్ మేనేజర్ గా చేరారు. అప్పుడు కంపెనీలో చేరిన ఏకైక ఎంబీఏ గ్రాడ్యూయేట్ల లో ఒకే ఒక్కరు మిలిందా. ఇలా ఒకే సంస్థలో పనిచేస్తూ ఒకరి పనితనం ఒకరికి నచ్చడం.. పలు విషయాల్లో ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో 1994 జనవరి 1న ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
పలు సేవలు, ధార్మిక కార్యక్రమాలు:
సాంకేతిక రంగంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు ధార్మిక సేవా కార్యక్రమాల కోసం కొన్ని సంస్థలు నెలకోల్పారు. ఇందులో కొన్ని కోట్ల రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. అంతేకాకుండా వ్యవసాయ, వైద్య, ఆరోగ్య రంగాల్లో కూడా మౌళిక సదుపాయాల కల్పనకు విశేషంగా కృషి చేశారు. వీరి పనుల దృష్యా ఇద్దరి అభిప్రాయాలు, ప్రపంచాలు వేరని ఇలా ఒకరివల్ల ఒకరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో చాలా సార్లు చర్చించి ఈ విడాకుల నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇలా ప్రపంచంలోనే ఎక్కువ ప్రజాదరణ చోరగొన్న వీరి జంట విడిపోవడం యావత్ ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కోసం కలిసి పనిచేస్తామని వారు ప్రకటించారు.
వైవాహిక జీవితంలోకి జెఫ్రీ ఎఫ్ స్టీన్ రాక:
2013లో ఓ ధాత్రుత్వ కార్యక్రమం కోసం గేట్స్ దంపతులు జెఫ్రీ ఎఫ్ స్టీన్ ను కలిశారు. అక్కడ అతని ప్రవర్తన నచ్చక పోవడంతో మిలిందా అసౌకర్యానికి గురైనట్లు గేట్స్ కి చెప్పారు. కానీ ఆమె మాటలు పట్టించుకోకుండా కంపెనీలో మరికొందరు ఉద్యోగులు కూడా ఎఫ్ స్టీన్ మాటలు నమ్ముతూ వచ్చారని ఒక రోజంతా గేట్స్ ఎఫ్ స్టీన్ తో ఉన్నారని అందుకే మిలిందాకు నచ్చలేదని ఇలాంటి కథనాలు చాలానే షికారు కొట్టాయి. అసలు విడాకులు తీసుకోవడానికి కారణాలు అధికారికంగా చెప్పనప్పటికీ లైంగిక వేధింపుల కేసులో నేరస్తుడైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ తో బిల్ గెట్స్ సంబంధాలు నచ్చని మిలిందా ఆయన నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్దమైనట్లు అప్పట్లో ప్రముఖ అమెరికన్ పత్రిక ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది. వృత్తిపరంగా ఫైనాన్షియర్ అయిన జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్‌స్టీన్ బాలికలు, మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం కేసుల్లో 2019 జులైలో అరెస్టయ్యాడు. కోర్టులో విచారణ జరుగుతుండగానే అదే ఏడాది ఆగస్టులో జైలులోనే అనారోగ్యంతో మృతి చెందాడు. ఈయనతో సంబంధాలు వద్దని ఎంత చర్చించినా బిల్ గెట్స్ స్పందించలేదని అందుకే 2019లో కోవిడ్ కారణంగా విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు మైక్రోసాప్ట్ ఉద్యోగి ఒకరు తెలిపినట్లు వార్తలు వినిపించాయి. దీని కారణంగానే సుదీర్ఘ చర్చలు జరిపి అవి ఫలించకపోవడంతో మే 3 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే 2020లో దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తాము పాల్గొనడం లేదని ప్రకటించిన గేట్స్ దంపతులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆతరువాత కొన్ని నెలలకు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, బెర్క్‌షైర్ హాథవే బోర్డుల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పుడే వీరిమధ్య ఆస్తి పంపకాలు, విడాకులపై చర్చలు జరుగుతున్నాయని, లాయర్లను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు పలు పత్రికల సారాంశం.
మిలిందా.. బిల్ గేట్స్ స్పందన:
తాజాగా మిలిందా ఫార్చ్యూన్ మేగజైన్‌తో మాట్లాడారు. తన విడాకుల అంశంపై స్పందించారు. విడాకుల కారణంగా తాను అంతులేని వేదనను అనుభవించానని పేర్కొన్నారు. ‘వివాహ బంధంలో సర్ధుకొనిపోలేకపోవడానికి నాకంటూ కొన్ని కారణాలు ఉన్నాయి. కొవిడ్ వల్ల నా విషయంలో ఓ మంచి జరిగింది. నాకు కావాల్సింది నేను చేయడానికి అవసరమైనంత ప్రైవసీ లభించింది. విడాకుల వల్ల తీవ్రమైన వేదనను అనుభవించా. ఆ బాధను దాటుకొని రావడానికి ఎవరికీ చెప్పుకోలేని ఓ రహస్యం ఉండేది. నేను విడిపోయిన వ్యక్తితోనే తరచూ పనిచేస్తుండేదాన్ని. ఉదయం తొమ్మిదింటికి ఏ వ్యక్తి వల్ల అయితే బాధపడేదాన్నో.. అదే వ్యక్తితో కలిసి పదింటికి కన్నీరు తుడుచుకొని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేదాన్ని’’ అని మెలిందా భావోద్వేగం చెందుతూ వివరించారు. తన విడాకుల గురించి గతంలో బిల్‌గేట్స్ కూడా స్పందించారు. ‘గత రెండు సంవత్సరాల్లో నా జీవితంలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నా దృష్టిలో మాది గొప్ప వివాహం. జరిగిన దానిని నేను మార్చలేను. నేను వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. అవకాశం వస్తే.. మెలిందానే మళ్లీ వివాహం చేసుకుంటా’ అని చెప్పారు.
బిల్ గేట్స్ మరో ప్రేమాయణం:
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మళ్లీ ప్రేమాయణం నడుపుతున్నాట్లు తెలుస్తుంది. రెండు సంవత్సరాల క్రితం మెలిందాతో విడాకులు తీసుకున్న గేట్స్.. ఏడాది నుంచి ఒరాకిల్ దివంగత సీఈవో భార్య పాలా హర్డ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆరు పదుల వయసున్న ఈ జంట ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఫోటోల్లో అడ్డంగా దొరికారు. దీంతో వారిపై డేటింగ్ ఊహాగానాలకు అగ్నికి వాయువు తోడైనట్లు బలం చేకూరింది. వీరిద్దరూ కొంతకాలంగా సన్నిహితంగా మెలుగుతోన్న విషయాన్ని వారి స్నేహితులు కూడా చెబుతున్నారు.
ఒరాకిల్ సీఈవో భార్యతో బిల్ గేట్స్:
పాలా హర్డ్ భర్త ఒరాకిల్ మాజీ సీఈవో. ఇతని పేరు మార్క్ హర్డ్ 2019 అక్టోబర్‌లో క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలు విడిచారు. పాలా హర్డ్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, సుమారు గత ఏడాది నుంచి వీరిద్దరూ తరుచూ కలిసి తిరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ ఫైనల్ మ్యచ్లో ఒకరికొకరు పక్కపక్కనే కూర్చొని ఆటను వీక్షించారు. వీరిద్దరు సన్నిహితంగా మెలుగుతున్నట్లు వచ్చిన పుకార్లపై వారికి సన్నిహితంగా ఉండేవారు ఇలా చెబుతున్నారు. ఆ బంధం విడదీయరానిది అంటూ అంతర్జాతీయ వార్త పత్రికలతో పేర్కొన్నారు.
గతంలో మిలిందను తప్ప వేరొకరిని పెళ్ళి చేసుకోను అన్న గేట్స్ మాటలు నిజమౌతాయా… లేక వీరిద్దరికీ మధ్య తగాదాలు సర్ధుమణిగిన కారణంగా మిలిందా తన మాజీ భర్త గేట్స్ వద్దకు వస్తుందా.. లేక మరో కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ పాలా హర్డ్ ను వివాహం చేసుకుంటారా.. చివరకు ట్రాంగిల్ సినిమా కథనంలాగా మారిన వీరి ప్రయాణం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచిచూడాలి.