Top story: 27 ఏళ్ల యోధుడి తో 58 ఏళ్ల ముసలోడి ఫైట్
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పడందరి కళ్లు...ఆ బాక్సింగ్ ఫైట్ మీదే ఉన్నాయి. ఆ బాక్సింగ్ లో మ్యాచ్ లో మహాబలుడు గెలుస్తాడా ? లేదంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిన ప్రొఫెషనల్ బాక్సర్ జేక్ పాల్ విజయం సాధిస్తాడా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పడందరి కళ్లు…ఆ బాక్సింగ్ ఫైట్ మీదే ఉన్నాయి. ఆ బాక్సింగ్ లో మ్యాచ్ లో మహాబలుడు గెలుస్తాడా ? లేదంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిన ప్రొఫెషనల్ బాక్సర్ జేక్ పాల్ విజయం సాధిస్తాడా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రొఫెషనల్ బాక్సింగ్ కు గుడ్ బై చెప్పిన మైక్ టైసన్…చాలా ఏళ్ల తర్వాత రింగ్ లోకి దిగుతుండటంతో మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది.
మైక్ టైసన్….మాజీ హెవీవెయిట్ చాంపియన్, బాక్సింగ్ లెజెండ్. రింగ్ లోకి దిగాడంటే ప్రత్యర్థుల గుండెల్లో వణుకుపుడుతుంది. బాక్సింగ్ ప్రపంచాన్ని ఏలిన టైసన్…దాదాపు 20 ఏళ్ల తర్వాత ఫైట్ కు రెడీ అయ్యాడు. యూట్యూబర్, యువ బాక్సర్ జేక్ పాల్ కు పంచ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అమెరికాలోని టెక్సాస్‌లో ఆర్లింగ్టన్‌లోని AT&T స్టేడియంలో… శనివారం రాత్రి ఆరున్నర గంటలకు జరగనున్న హెవీ వెయిట్ బౌట్‌లో..జేక్ పాల్ ను ఢీ కొట్టబోతున్నాడు. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు దాదాపు 80 వేల ప్రేక్షకులు హాజరవుతున్నారు. వాస్తవానికి జూలై 20న జరగాల్సి ఉంటే…మైక్ టైసన్ అనారోగ్యం పాలవడంతో రేపటికి వాయిదా వేశారు. అయితే ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. మైక్ టైసన్ 58 ఏళ్లు కాగా, పాల్ వయసు 27 ఏళ్లు మాత్రమే. టైసన్, పాల్ మధ్య వయస్సు వ్యత్యాసం ప్రొఫెషనల్ బాక్సింగ్ చరిత్రలో అతిపెద్దది. పాల్ కంటే టైసన్ 30 ఏళ్లు పెద్దవాడు.
అయితే టైసన్ వర్సెస్ పౌల్ మ్యాచ్‌లో.. మొత్తం 8 రౌండ్లు ఉంటాయి. ఒక్కొక్క రౌండ్ రెండు నిమిషాలు జరుగుతుంది. సాధారణ 10 ఔన్సుల గ్లోవ్స్ కన్నా ఎక్కువగా ఉన్న 14 ఔన్సుల గ్లోవ్స్‌లో మ్యాచ్ లో ఉపయోగించనున్నారు. గాయాలను తగ్గించేందుకు ఎక్స్‌ట్రా ప్యాడింగ్ తో బాక్సర్లు బరిలోకి దిగనున్నారు. ఈ బౌట్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మైక్ టైసన్ బాక్సింగ్ లో తిరుగులేని హెవీ వెయిట్ ఛాంపియన్. మహామహులను రింగ్ లో మట్టికరిపించాడు. నాకౌట్ ద్వారా 44 విజయాలు విజయాలు సాధించాడు. 50-6 కెరీర్ రికార్డుతో ప్రొఫెషనల్ కెరీర్ ను ముగించాడు. 2005 నుంచి ప్రొఫెషనల్ బాక్సింగ్ కు విరామం ప్రకటించాడు. 2020లో రాయ్ జోన్స్ జూనియర్‌తో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మైక్ టైసన్ తలపడ్డాడు. ఇది డ్రాగా ముగిసింది.
అటు 27 ఏళ్ల జేక్ పాల్…ఏడు నాకౌట్లతో 10-1 రికార్డు ఉంది. ప్రొఫెషనల్ బాక్సర్ అయిన జేక్ పాల్…యూట్యూబర్‌గా మారాడు. ఆండర్సన్ సిల్వా, టైరాన్ వుడ్లీ వంటి మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్లు, మాజీ ఎన్బీఏ ప్లేయర్ నేట్ రాబిన్సన్ వంటి వారిని ఢీ కొట్టాడు. నాలుగు నెలల క్రితం మైక్ పెర్రీపై ఆరో రౌండ్ లో విజయం సాధించాడు. గత ఏడాది ముగ్గురిపై ఈజీగా విక్టరీ కొట్టాడు. ఓపెనింగ్ రౌండ్లలోనే ప్రత్యర్థులను మట్టికరిపించాడు. టైసన్‌ను నాకౌట్ చేస్తానని జేక్ పాల్ సవాల్ విసిరాడు. 1986లోనే 20 ఏళ్ల వయసులోనే టైసన్ ప్రపంచ హెవీ వెయిట్ టైటిల్‌ను గెలిచాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో టైసన్ విజయాల శాతం 88గా ఉంది. 2005లో కెవిన్ మెక్‌బ్రౌడ్ చేతిలో ఓటమి తర్వాత మైక్ టైసన్…ప్రొఫెషనల్ బాక్సింగ్ కు వీడ్కోలు పలికాడు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత…టైసన్ మళ్లీ తన పంచ్ పవర్ చూపించేందుకు రెడీ అయ్యాడు.
19 ఏళ్ల విరామం తర్వాత మైక్ టైసన్ తలపడుతుండటంతో…అందరికి కళ్లు ఈ మ్యాచ్ పైనే ఉన్నాయి. మునుపటి ఎనర్జీ లేకపోయినా…జేక్ పాల్ ను పడగొట్టాలన్న లక్ష్యంతో టైసన్ ప్రాక్టీస్ చేశాడు. అటు జేక్ పాల్ కూడా తానేమీ తక్కువ కాదని…చెబుతున్నాడు. టైసన్ పై గెలిచి…40 మిలియన్ల నగదును సొంతం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.