Protem Speaker, Akbaruddin : తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్..
తెలంగాణ మూడో అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధం అయింది. ఇవాళ ఉదయం రాజ్ భవన్ లో తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.

MIM MLA Akbaruddin as Protem Speaker of Telangana Assembly..
తెలంగాణ మూడో అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధం అయింది. ఇవాళ ఉదయం రాజ్ భవన్ లో తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఇక ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్. ప్రొటెం స్పీకర్ ప్రమాణానికి బీజేపీ ఎమ్మెల్యేలు గైడ్ హాజర్ అయ్యారు. ఈసారి కొత్తగా ఎన్నికైన 51 ఎమ్మెల్యేలతో సహా మొత్తం 119 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.