MIMA చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.. దేశంలో ఎక్కువగా కండోమ్లు వాడేదే ముస్లింలే..
దేశ సార్వత్రిక ఎన్నికల (National General Elections) వేళ ఏఐఎంఐఎం పార్టీ (MIMA Party) చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

MIMA chief Asaduddin Owaisi's sensational comments.. Muslims are the ones who use condoms the most in the country..
దేశ సార్వత్రిక ఎన్నికల (National General Elections) వేళ ఏఐఎంఐఎం పార్టీ (MIMA Party) చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీకి కౌంటర్ గా MIMA పార్టీ చీఫ్ అసదుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు ఎక్కువ మంది పిల్లలు ఉంటారని మోదీ అంటున్నారనీ.. కానీ ఎక్కువ మంది ముస్లింలు కండోమ్‌లు (Condoms) వాడతారంటూ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు.
ముస్లింలను ఉద్దేశించి PM మోదీ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ (Owaisi) మండిపడ్డారు. ‘ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారని ఎందుకు భయం సృష్టిస్తున్నారు? మోదీ ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ముస్లింల జనాభా పెరుగుదల, సంతానోత్పత్తి తగ్గిందని చెప్పారు. భారత దేశంలో ముస్లింలే ఎక్కువగా కండోమ్లు వాడుతారు. ఈ విషయం చెప్పేందుకు నేనేమీ సిగ్గు పడను’ అని స్పష్టం చేశారు. ఇంకెంత కాలం ఇలా భయపెడతారని.. మతమే వేరు కానీ తామంతా భారతీయులమని ఒవైసీ అన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఓ సభలో మోడీపై విమర్శలు గుప్పించారు అసదుద్దీన్ ఓవైసీ..
SSM