NTR Statue: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో కేటీఆర్ హాట్ కామెంట్స్
ఖమ్మం జిల్లాలోని ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టించేందుకు అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ తాజాగా మంత్రి కేటీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. అయితే ఈ ఆవిష్కరణ పై కొన్ని లుకలుకలు, అభ్యంతరాలు అలుముకున్నాయి. ఈయన విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించడం కొందరికి నచ్చడం లేదు. ఎందుకో ఇప్పుడు చూద్దాం.
ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ పై రూ. 1.37 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ పార్క్ తో పాటు ఎన్టీఆర్ విగ్రహాలని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎన్టీఆర్ ఆదర్శం అన్నారు. రాముడు,కృష్ణుడు ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ బహుశా ఆయనలాగే ఉంటారనుకునేవాళ్ళం.నాకు వారి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎందరోచ్చినా ఎన్టీఆర్ కు సాటిలేరు అని కీర్తించారు. తారకరామారావు అనే పేరులోనే ఎదో శక్తి ఉంది అని కొనియాడారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ కూడా హ్యాట్రిక్ కొట్టలేకపోయారు అని చెబుతూనే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం హ్యాట్రిక్ కొడతారు అని జోస్యం చెప్పారు. ఆయన పేరు నాలో ఉన్నందన రెండు సార్లు మంతిని అయ్యానని చెప్పారు. ఎన్టీఆర్ అనే పేరులోనే ఏదో పవర్ ఉందని ప్రసంశల జల్లు కురిపించారు. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ మూడో సారి సీఎం అవుతారన్నారు.
ఇదంతా ఇలా ఉంటే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ చేయించడం యాదవ సామాజిక వర్గం వారికి ఏమాత్రం ఇష్టంలేదు. కేవలం పువ్వాడకు రాజకీయ మైలేజ్ కోసమే ఈయనను తెరపైకి తీసుకొచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే విగ్రహాన్ని ఆవిష్కరించి తన పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందనే రాజకీయ కామెంట్స్ చేశారు. ఇవి ఓ వర్గం వారికి కించిత్ బాధను కలిగించింది. ఎన్టీఆర్ ఎకరి సొత్తు కాదని తీవ్రంగా మండిపడుతున్నారు కొందరు నేతలు. గతంలో పువ్వడకు కొన్ని ఓట్లు తగ్గినందున ఈ సామాజిక వర్గం వారిని ఆకర్షించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వీరితో పాటూ తెలుగుదేశంపార్టీతో పాటూ మహాజన సంఘం నాయకులు కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. గతంలో కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనను తీసుకొచ్చింది తానా మాజీ ప్రెసిడెంట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ విగ్రహ ఏర్పాటు కోసం ఎన్ఆర్ఐ లు అందరూ కలిసి కొంత డబ్బులు పోగేసి దీనిని నిర్మించాలని భావించారట. దీనిని పువ్వాడ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఈ ఆలోచనను తాను స్వీకరించి పార్టీ మైలేజ్ కోసం వినియోగించడాన్ని తప్పుపడుతున్నారు కొందరు టీడీపీ నాయకులు.
T.V.SRIKAR