Minister Roja: వాళ్ళ సంగతి కోర్టులో చూసుకుంటా..! ముగ్గురిపై పరువు నష్టం దావా వేసిన మంత్రి రోజా..
కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత బండారు సత్యనారాయణ.. రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనపై పోలీస్ కేసు కూడా నమోదైంది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేయగా.. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.

Minister Roja: ఏపీ మంత్రి, సినీ నటి రోజా మంగళవారం పరువు నష్టం దావా దాఖలు చేశారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, నగరి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గాలి భాను ప్రకాష్‌తోపాటు ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధి రాజేంద్రప్రసాద్‌పై నగరి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ ముగ్గురూ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని పేర్కొంటూ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. రోజా వేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది.
Swathi Deekshith: కబ్జా స్టార్.. రూ.30 కోట్ల ఇల్లు కబ్జా.. స్టార్ హీరోయిన్ అరెస్ట్..
రోజాపై వాళ్లు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సాక్షాలను కూడా ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత బండారు సత్యనారాయణ.. రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రోజా అసభ్యకర చిత్రాల్లో నటించింది అనీ.. తన దగ్గర సీడీలు ఉన్నాయంటూ బండారు చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై ఆయనపై పోలీస్ కేసు కూడా నమోదైంది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేయగా.. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. బండారు చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. తనపై అసభ్యకరంగా మాట్లాడటంపై రోజా అప్పట్లో కన్నీళ్ళు కూడా పెట్టుకుంది. పలువురు సినీ తారలు ఈ వ్యాఖ్యల్ని ఖండించారు. కోర్టులో కేసు దాఖలు చేసిన అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. “మహిళ అయితే ఏదైనా అనే స్వేచ్ఛ వాళ్ళకి ఉంటుందా..? సమాజంలో నన్ను తిరగకుండా చేస్తారా..? న్యాయం నావైపే ఉంది. నేను గెలుస్తా. న్యాయాన్ని నమ్ముకున్నా. నన్ను అవమానించిన ఆ ముగ్గురికి శిక్షపడుతుందని నమ్ముతున్నా” అని వ్యాఖ్యానించారు.