ROJA: రోజాకు నో టిక్కెట్ ! 10 మంది మంత్రులకీ డౌటే !!
ఒకేసారి 11మంది ఇన్‌చార్జులను మార్చేసిన అధిష్టానం.. ఇంకా కొంతమందిని రెడీగా ఉండాలని సిగ్నల్స్ పంపిందట. అలా సమాచారం అందుకున్న వాళ్ళల్లో ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో కొనసాగుతున్న మంత్రుల్లో కనీసం సగం మంది ఉన్నారని తెలుస్తోంది.
ROJA: ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈసారి సిట్టింగ్స్ విషయంలో చాలా మందిని మార్చబోతున్నట్టు తెలుస్తోంది. ఒకేసారి 11 మంది ఇంఛార్జులను మార్చేశారు. కానీ ఇంకా 60 మంది దాకా ఛేంజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. 10మంది మంత్రులకు కూడా ఈసారి టిక్కెట్లు నిరాకరిస్తున్నట్టు సమాచారం. వీళ్ళల్లో నగరి ఎమ్మెల్యే అయిన మంత్రి రోజాకు కూడా టిక్కెట్ ఇవ్వట్లేదని అంటున్నారు. ఇప్పటికే రోజాకి సమాచారం కూడా ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వై నాట్ 175 అంటున్న వైసీపీ.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందర్నీ మారుస్తోంది. ఒకేసారి 11మంది ఇన్‌చార్జులను మార్చేసిన అధిష్టానం.. ఇంకా కొంతమందిని రెడీగా ఉండాలని సిగ్నల్స్ పంపిందట.
BANDI SANJAY: తెలంగాణ బీజేపీ పగ్గాలు మళ్లీ బండికే !
అలా సమాచారం అందుకున్న వాళ్ళల్లో ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో కొనసాగుతున్న మంత్రుల్లో కనీసం సగం మంది ఉన్నారని తెలుస్తోంది. జనంలో బాగా పాపులర్ అయిన రోజా, అంబటి రాంబాబు లాంటి మంత్రులను కూడా పక్కన పెట్టేస్తోంది వైసీపీ. మరికొందరు సీనియర్ మంత్రులను పార్లమెంటు స్థానాలకు పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం డిసైడ్ అయింది. జగన్ మంత్రి వర్గంలో 10 మంది మంత్రులకు ఈసారి టిక్కెట్లు ఇవ్వడం లేదని, ఇప్పటికే ఆ మంత్రులకు హైకమాండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు చెబుతున్నారు. మంత్రుల్లో నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే రోజాకు కూడా సమాచారం వెళ్ళిందని తెలిసింది. రోజాకు మొదటి విడతలో మంత్రి పదవి ఇవ్వలేదు సీఎం జగన్. అయితే నటిగా, జబర్దస్త్ ద్వారా ఆమెకు పాపులారిటీ ఉండటంతో రెండోసారి కేబినెట్ విస్తరణలో ఛాన్సిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాపులర్ అయిన రోజా.. సొంత నియోజకవర్గం నగరిలో మాత్రం జనానికి దూరమయ్యారని టాక్ నడుస్తోంది.
JEEVAN REDDY: ఆర్మూర్ బీఆర్ఎస్‌లో ముసలం.. పాండు అడ్డాలో అలజడి..
లోకల్ వైసీపీ లీడర్లు రోజా అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోవడం లేదు. దాంతో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉంది. రోజా మాత్రం తనకు నగరిలో తిరుగులేదని చెబుతున్నారు. జనంలో, లీడర్లలో అసంతృప్తి ఉందన్న సంగతిని ఆమె ఒప్పుకోవడం లేదు. అయినప్పటికీ ఈసారి వైసీపీ టిక్కెట్ ఇవ్వడం కష్టమేనని రోజాకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. మిగతా మంత్రుల్లో అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, జోగి రమేష్, విశ్వరూప్ ఇలా మొత్తం 10మంది మంత్రులకు వైసీపీ టికెట్లు ఇవ్వడం డౌటే అంటున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటించే నాటికి ఇంకా కొందరు మంత్రులు ఈ లిస్టులో చేరవచ్చని అంటున్నారు. దాదాపు 60 మంది దాకా మార్పులు, చేర్పులు, తొలగింపులు జరుగుతాయనీ, వాళ్ళల్లో మంత్రులూ ఉంటారని సమాచారం. మంత్రి అంబటి రాంబాబు ప్రత్యర్థులపై మాటలతో దాడి చేస్తుంటారు. కానీ సొంత జిల్లాలో మాత్రం వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.
సత్తెనపల్లిలో జనం ఎదురు తిరిగిన సంఘటనలు కూడా జరిగాయి. జగన్ పై విధేయత ఉన్నా జిల్లాలో పార్టీని నడిపించలేకపోతున్నారని అంటున్నారు. అందుకే అంబటి రాంబాబును పక్కన పెడుతున్నారనీ, ఆయన కూడా ఈ ప్రపోజల్ కు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. జగన్ కేబినెట్‌లో సీనియర్ మంత్రులు ధర్మాన, బొత్స, పెద్దిరెడ్డి, బుగ్గన లాంటి వారికి నియోజకవర్గాల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. అయినా వ్యూహాత్మకంగా వీళ్ళల్లో కొందరిని ఎంపీలుగా పోటీ చేయించాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది.