Mantri Roja, Lok Sabha MP : ఒంగోలు లోక్‌సభ బరిలో మంత్రి రోజా!
ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది వైసీపీ (YCP)లో ! అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా.. జగన్ రచిస్తున్న వ్యూహాలు, వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. రాజకీయాన్ని వేడెక్కించడమే కాదు.. ఫ్యాన్ పార్టీ నేతలకు చెమట్లు పట్టిస్తున్నాయ్. నియోజకవర్గ ఇంచార్జిలను మారుస్తూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు.. వైసీపీ నాయకులు నిద్రలేకుండా చేస్తున్నాయ్.
ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది వైసీపీ (YCP)లో ! అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా.. జగన్ రచిస్తున్న వ్యూహాలు, వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. రాజకీయాన్ని వేడెక్కించడమే కాదు.. ఫ్యాన్ పార్టీ నేతలకు చెమట్లు పట్టిస్తున్నాయ్. నియోజకవర్గ ఇంచార్జిలను మారుస్తూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు.. వైసీపీ నాయకులు నిద్రలేకుండా చేస్తున్నాయ్. ఇప్పటికే నాలుగు జాబితాలు అనౌన్స్ చేశారు. ఇదేమీ ఫైనల్ కాదని.. మార్పులు ఇంకా ఉన్నాయ్. మార్పు మంచికే అన్నట్లుగా.. జగన్ (CM Jagan) నిర్ణయాలు కనిపిస్తున్నాయ్. రిలీజ్ అయిన నాలుగు జాబితాల్లో.. సిట్టింగ్ మంత్రులకు కూడా సీటు గల్లంతు అయింది. మిగతావాళ్ల సంగతి ఎలా ఉన్నా.. మంత్రి రోజా (Mantri Roja) గురించే.. ఇప్పుడు ఏపీ రాజకీయా (AP Politics) ల్లో హాట్‌టాపిక్‌గా మారింది. నగరి నుంచి రోజా మళ్లీ చేస్తారా.. జగన్ అవకాశం కల్పిస్తారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోజా ఒకరు ఒకవైపు.. వైసీపీలో మిగతా నేతలంతా ఒకవైపు అన్నట్లుగా ఉన్నారు. ముఖ్యంగా రోజా తీరుపై.. పార్టీ పెద్ద పెద్దిరెడ్డి చాలా గుర్రు మీద ఉన్నారుు. నగరి టికెట్ ఎలాగైనా తన వర్గం నేతకు ఇప్పించాలని ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఉంది. దీనికితోడు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం రోజా డబ్బులు డిమాండ్ చేశారంటూ.. ఈ మధ్య ఓ కౌన్సిలర్.. మీడియా ముందుకు రావడంతో.. రోజా టికెట్ మీద మరిన్ని అనుమానాలు అలుముకున్నాయ్. ఇలాంటి పరిణామాల మధ్య.. ఏపీ రాజకీయవర్గాల్లో ఇప్పుడో కొత్త ప్రచారం ఊపందుకుంది.
ఒంగోలు లోక్‌సభ (Ongole Lok Sabha) స్థానం నుంచి రోజాను బరిలో దింపాలనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నారనే ప్రచారం.. ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతోంది. ప్రకాశం జిల్లా నాయకులకు.. విజయసాయిరెడ్డి ఇప్పటికే సమాచారం కూడా అందించారట. సిట్టింగ్ ఎంపీ మాగుంటకు టికెట్ లేదని.. జగన్ ఇప్పటికే తేల్చేశారు. దీంతో రోజా పోటీ చేయడం ఖాయం అంటూ మరో ప్రచారం ఊపందుకుంది. వీటన్నింటికి తోడు.. మాగుంట, ఆయన వర్గంతో విజయసాయి రెడ్డి మంతనాలు జరపడం.. ఈ ప్రచారం మరింత బలంగా వినిపించేలా చేస్తోంది.
నిజానికి ఒంగోలు సీటు కోసం వైసీపీలో భారీ పోటీనే కనిపించింది. మాగుంటకు టికెట్ లేదు అని జగన్ అనౌన్స్ చేసిన తర్వాత.. మాజీ మంత్రి బాలినేని చాలా రాయబారమే నడిపారు. ఐనా సరే వర్కౌట్ కాలేదు. ఇక అటు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరును కూడా ఒంగోలు ఎంపీ స్థానానికి అధిష్ఠానం ప్రతిపాదించింది. ఐతే బాలినేనితో సహా జిల్లాలోని నాయకులు అందరూ చెవిరెడ్డిని వ్యతిరేకించారు. తండ్రీకొడుకులకు ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నించారు. అదే జరిగితే తన కుమారుడు ప్రణీత్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారట. ఐతే ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో విజయసాయి ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఎంపీ అభర్థిగా రోజా పేరు పరిశీలనలో ఉందని.. దాదాపు ఖరారు అయినట్లే అని హింట్ కూడా ఇచ్చారట. అసలే రంకెలు వేస్తున్న ఒంగోలు రాజకీయం.. ఈ పరిణామంతో ఇంకెలాంటి మలుపు తిరుగుతుందో అనే చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.