KTR: చంద్రబాబు, వైఎస్సార్‌పై కేటీఆర్ ప్రశంసలు.. ఆచితూచి మాట్లాడుతున్న కేటీఆర్
గతంలో పలుమార్లు విమర్శలు చేసిన చంద్రబాబు, వైఎస్సార్‌పై తాజాగా కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రంలో పాతికేళ్లు వెనక్కు వెళ్లి చూస్తే.. ముగ్గురే సీఎంలు గుర్తుకువస్తారన్నారు. వాళ్లు చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు.
KTR: ఎన్నికలు జరుగుతున్న సమయంలో నాయకులు ప్రతి మాటా ఆచితూచి మాట్లాడాలి. ముఖ్యంగా ఏ నాయకుడిని, వర్గం వారిని కించపరిచేలా అస్సలు మాట్లాడకూడదు. అలా చేస్తే వారిని అభిమానించే వారి ఓట్లు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఈ విషయం గుర్తించిన కేటీఆర్ ఇప్పుడు ఆచితూచి మాట్లాడుతున్నారు. మొన్న చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడి.. ఆ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ నేతలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరింత జాగ్రత్తతో ఉంటున్నారు.
REVANTH REDDY: 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకొంటా: రేవంత్ రెడ్డి
గతంలో పలుమార్లు విమర్శలు చేసిన చంద్రబాబు, వైఎస్సార్‌పై తాజాగా కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రంలో పాతికేళ్లు వెనక్కు వెళ్లి చూస్తే.. ముగ్గురే సీఎంలు గుర్తుకువస్తారన్నారు. వాళ్లు చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్‌లో మంగళవారం జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత పాతికేళ్లలో చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్‌లే ప్రధానంగా సుదీర్ఘ కాలం సీఎంలుగా ఉండి రాష్ట్రం మీద, హైదరాబాద్ నగరంపైనా తమదైన ముద్ర వేశారన్నారు. వీరిలో చంద్రబాబు ప్రో బిజినెస్, ప్రో ఐటీ, ప్రో అర్బన్ మోడల్ ఫాలో అయితే, రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పూర్‌గా ఉండేవారని చెప్పారు. ఇక.. ఈ రెండు మోడల్స్ కలిపిన నేత కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. “రాజకీయాల్లో స్థిరత్వం ముఖ్యం. ఆరు నెలలకోసారి పార్టీ పెద్ద మారితే అక్కడ స్థిరత్వం ఉండబోదు.
వేగంగా, మెరుగైన నిర్ణయాలు తీసుకొనే పటిమ ఉన్న వ్యక్తి లీడర్‌గా ఉంటే మంచి ఫలితాలు సాధిస్తాం. ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో రెండేళ్లు కోవిడ్‌కే పోయింది. నికరంగా మేం పని చేసింది ఆరున్నర సంవత్సరాలే. అంతకుముందు 65 ఏళ్లు అధికారంలో ఉన్న వారు ఏం చేశారో, ఈ ఆరున్నర ఏళ్లలో మేం ఏం చేశామో కళ్లెదుటే కనబడుతోంది. గత పాతికేళ్లలో ఈ ముగ్గురే ప్రధానంగా సుదీర్ఘ కాలం సీఎంలుగా ఉండి రాష్ట్రం మీద, హైదరాబాద్ నగరంపైనా తమదైన ముద్ర వేశారు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.