ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేసిన మిస్టర్ బచ్చన్ ట్రైలర్…!

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా హీరోగా వస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను కాసేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 7, 2024 | 07:57 PMLast Updated on: Aug 07, 2024 | 7:57 PM

Mister Bachhan Trailer Release

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా హీరోగా వస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను కాసేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో పవర్ ఫుల్ డైలాగ్ లు ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. రవితేజ ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు. గత సినిమాల కంటే కాస్త కొత్తగా రవితేజను ఈ సినిమాలో హరీష్ శంకర్ చూపించాడు. రవితేజ మాస్ ఇమేజ్ కు ఎక్కడా లోటు లేకుండా సన్నివేశాలను షూట్ చేసాడు హరీష్ శంకర్.

ఒక బిగ్ షాట్ ను లక్ష్యంగా చేసుకుని ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తుంది. సరిహద్దు కాపాడే వాడే సైనికుడు కాదు సంపద కాపాడే వాడు కూడా సైనికుడే అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ మన దేశంలో ఎంత శక్తివంతంగా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. భారత ఆర్మీ ఎంత శక్తివంతం అయిందో ఇన్కంటాక్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే శక్తివంతం అయింది అనేది నిరూపిస్తా అంటూ రవితేజ పవర్ ఫుల్ డైలాగ్ లను తన మాస్ స్టైల్ లో చెప్పారు.

ఇక హీరోయిన్ భాగ్యశ్రీని కూడా దర్శకుడు అందంగా చూపించాడు. ఇక జగపతి బాబు పాత్ర కూడా ఈ సినిమాలో పవర్ ఫుల్ గా చూపించనున్నారు. అరవింద సమేత తరహాలో జగపతి బాబు కనపడుతున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగస్ట్ 15 సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ట్రైలర్ చివర్లో రూమర్లు, గాసిప్ లపై తనదైన శైలిలో హరీష్ శంకర్ డైలాగ్ వినిపించారు. దేశంలో చాలా మంది భయపడేది వాటికే అంటూ రవితేజ కాస్త ఆసక్తికర డైలాగ్ చెప్పారు. ఓవరాల్ గా ట్రైలర్ ఆకట్టుకుంది.

https://www.youtube.com/watch?v=BZefBM0Bwdc