MLC by-election : నేటితో ముగియననున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు.. బీజేపీ అభ్యర్థి గుజ్జుల నామినేషన్
నేడు తెలంగాణలో నేటితో వరంగల్-ఖమ్మం-నల్గొండ (Warangal-Khammam-Nalgonda) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక (By-election) నామినేషన్ల పర్వం ముగియనుంది. శుక్రవారం నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుండగా.. ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

MLC by-election nominations to end today.. BJP candidate Gujjula's nomination
నేడు తెలంగాణలో నేటితో వరంగల్-ఖమ్మం-నల్గొండ (Warangal-Khammam-Nalgonda) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక (By-election) నామినేషన్ల పర్వం ముగియనుంది. శుక్రవారం నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుండగా.. ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. బుధవారం మరో 12 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో నామినేషన్లు వేసిన వారి సంఖ్య 41కి చేరింది. మే 27న పోలింగ్, జూన్ 5న కౌంటింగ్ ఉంటుంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల MLC ఎన్నిక (MLC Elections) జరగనుంది. ఈరోజు BJP ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. గుజ్జుల ప్రేమందర్ రెడ్డి పేరును పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది. ఆయన నేడు నామినేషన్ దాఖలు చేయడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తీన్మార్ మల్లన్న పేరును, BRS ఏనుగుల రాకేశ్రడ్డి పేరును ఖరారు చేసింది. కాగా మూడు పార్టీలూ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ప్రధాన పార్టీ తరఫున నామినేషన్లు..
బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి…
బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి…
కాంగ్రెస్ అభ్యర్థిగా తిన్నార్ మల్లన్న…
ఇతర పార్టీల తరఫున నామినేషన్లు..
గోండ్వానా దండకారణ్య పార్టీ నుంచి సోడే వెంకటేశ్వర్లు, సోషల్ జస్టిస్ పార్టీ నుంచి చెన్నా శ్రీకాంత్, తెలంగాణ రిపబ్లికన్ పార్టీ నుంచి గుండాల జ్యోతి, తదితరులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనకు నామినేషన్లు అందజేశారు.
స్వతంత్ర అభ్యర్థుల తరఫున నామినేషన్లు..
స్వతంత్ర అభ్యర్థులుగా పోతుల ప్రార్థన, గుగులోతు రాజునాయక్, పట్నం మల్లికార్జున్, తేజావత్ వాసుదేవ, యాతాకుల శేఖర్, దునుకుల వేలాద్రి, గుగులోతు సంతోష్, రత్నం ప్రవీణ్, జున్ను భరత్,
SSM