MLC Elections : ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్

తెలంగాణ బీజేపీ (BJP) పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) వేళ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ బిజెపి పార్టీ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 8, 2024 | 12:39 PMLast Updated on: May 08, 2024 | 12:39 PM

Mlc By Election Premender As Bjp Candidate

తెలంగాణ బీజేపీ (BJP) పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) వేళ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ బిజెపి పార్టీ. రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుండగా ఇప్పటివరకు 30 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న (Tinnar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ (Chintapandu Naveen), బీఆర్ఎస్ (BRS) అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ప్రధాన పార్టీల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలలో ముగ్గురు బరి ఉన్నారు.

కాగా గత వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి 2021లో ఎన్నికలు జరగ్గా.. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి (Enugula Rakesh Reddy) విజయం సాధించారు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. కాగా గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) తరఫున జనగామ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో.. ఎమ్మెల్సీ స్థానంకు రాజీనామ చేశారు. దీంతో ఉప ఎన్నిక (By-Elections) అనివార్యమైంది.

ఇక వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి మే 2 కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 9 వరకు నామినేషన్ల స్వీకరణకు, 10 పరిశీలన, 13న ఉపసంహరణకు చివరి తేదీలుగా ప్రకటించింది. ఉప ఎన్నికల పోలింగ్ మే 27న ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు వరకు జరగనుండగా.. జూన్ 5న కౌంటింగ్ ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఈసారి త్రిముఖ పోటీలో ఎవరు ఎమ్మెల్సీగా విజయం సాధిస్తారో వేచి చూడాలి.